
📌 Key Points
- సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరూ లేరని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
- దాసరి నారాయణరావు, ఎన్టీఆర్ వంటి వారిని భర్తీ చేసే వ్యక్తులు రాలేరని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
- ప్రస్తుతం ఇండస్ట్రీలో సమస్య వస్తే ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
- చిన్న సినిమాల ఫంక్షన్లకు తమ్మారెడ్డిని పిలుస్తున్నా ఆయన విమర్శలు చేస్తున్నారు.
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరూ లేరని, సమస్యలు పరిష్కరించే నాథుడు కరువయ్యారని ఆయన అన్నారు. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు కరువు?
Thammareddy: దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) తెలుగు సినిమా ఇండస్ట్రీకి (Tollywood) సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆయనకు మైక్ దొరికితే చాలు, ఏదో ఒక కాంట్రవర్సీ మాటలు మాట్లాడటం అలవాటే. అలాగే ఒక మాట మీద కూడా ఉండరు. ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలన్నీ వైసీపీకి సపోర్ట్‌గా ఉంటుంటాయి. వాస్తవానికి ఆయనని కూడా ఇండస్ట్రీలో ఓ పెద్ద మనిషిగా చూస్తుంటారు. చిన్న సినిమాల ఫంక్షన్స్‌కు తమ్మారెడ్డిని గెస్ట్‌గా పిలుస్తుంటారు. అలాంటి తమ్మారెడ్డి భరద్వాజ తన పెద్దరికాన్ని నిలుపుకోవాల్సింది పోయి, ఏదేదో మాట్లాడేస్తుంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరని, ఎవరి దగ్గరకు వెళ్లిన సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదని తన తాజా ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
దాసరి, ఎన్టీఆర్ లేని లోటు
ఎప్పుడో సోషల్ మీడియాలు, ఇతర మీడియాల ప్రభంజనం లేనప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించిన దాసరిని కూడా ఆయన వదల్లేదు. ఎన్టీఆర్ తర్వాత అనుకోకుండా దాసరికి పెద్దరికం పదవి వచ్చిందని, ఇప్పుడసలు ఇండస్ట్రీలో పెద్ద అనే వారే లేరని తమ్మారెడ్డి అన్నారు. ‘దాసరి (Dasari), ఎన్టీఆర్ (NTR)ను రీప్లేస్ చేసే మనుషులు ఏ రకంగానూ ఇక రారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే, పలానా మనిషి దగ్గరకు వెళితే సమస్య పరిష్కారం అవుతుందనే పరిస్థితులు లేవు’ అని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చెప్పిందంతా బాగానే ఉంది కానీ, ఆ పరిస్థితులను కల్పించింది ఎవరో కూడా తమ్మారెడ్డి చెప్పి ఉంటే బాగుండేది. అప్పట్లో దాసరి పెద్దరికం చేసినప్పుడు, ప్రస్తుతం ఉన్నంత పెద్ద సమస్యలేవీ లేవు. రెండు సినిమాలు క్లాష్ అవుతుంటేనే, షూటింగ్స్ షెడ్యూల్స్ విషయంలోనో తగాదాలు వస్తే దాసరిని సంప్రదించేవారు. ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీగా ఉండడం, ఏఎన్నార్ నాకెందుకులే అని కామ్‌గా ఉండటం, కృష్ణ ప్రయోగాలు చేస్తుండటంలో బిజీగా ఉండటంతో.. దాసరికి ఎదురు చెప్పేవారు, పెద్దరికం విషయంలో పుల్లలు పెట్టేవారు లేరు, కాబట్టి గడిచిపోయింది.
పరిష్కారం లేని సమస్యలు: తమ్మారెడ్డి ఆవేదన
కానీ, నేటి పరిస్థితి అలా లేదు. ప్రత్యేకంగా ఇండస్ట్రీకి నేనే పెద్ద అని ప్రకటించుకున్నవారు కూడా ఉన్నారు. ఒక్క రూపాయి ఇండస్ట్రీ కోసం ఖర్చు పెట్టడానికి వంద రకాలుగా ఆలోచించే వారు కూడా నేనే ఇండస్ట్రీ పెద్దనని ప్రకటించుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని అంతా పెద్దగా భావిస్తుంటే, ఒక బ్యాచ్ మొత్తం వెళ్లి బాలకృష్ణకి బాగా ఎక్కేయడం, ఆయన నోటికి వచ్చింది మాట్లాడటం తెలియంది ఎవరికి. వెంకీ, నాగ్ ఎలాగూ.. ఈ లీగ్‌లోకి ఎంటరవరు కాబట్టి, ఏ చిన్న విషయం ఉన్నా, వెంటనే రియాక్ట్ అయ్యే పర్సన్, ప్రభుత్వాలతో మాట్లాడగల స్టామినా ఉన్న స్టార్ ఎవరైనా ఉన్నారూ అంటే, అది కేవలం చిరంజీవి మాత్రమే. ఆయనే నాకు ఈ పెద్దరికం వద్దని పబ్లిగ్గా చెప్పారు. ఇద్దరి మధ్య గొడవలు తీర్చే పెద్దరికం నాకు వద్దు, కష్టం అని వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ఇంటి తలుపు తెరిచే ఉంటుందని చిరంజీవి ఓపెన్‌గా చెప్పారు. ఇంతకంటే పెద్దరికానికి కావాల్సిన అర్హత ఏముంటుంది? నిజంగా చిరంజీవి కలగజేసుకుంటే అవ్వని పని ఉంటుందా? తీరని సమస్య ఉంటుందా? ఏం తమ్మారెడ్డి ఏమంటారు?
మొత్తానికి తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. పరిశ్రమలో ఒకప్పుడు ఉన్న పెద్దరికం ఇప్పుడు లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇండస్ట్రీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


