
కాంతారా సినిమాతో పాపులర్ అయిన సప్తమి గౌడ, నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు బంపర్ ఆఫర్లు వస్తున్నాయని వార్తలు.
Key Points
సప్తమి గౌడ 'తమ్ముడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని తెలుగు సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాలలోనూ నటిస్తున్నారు.
పుష్ప సినిమాలో రష్మిక మందన పాత్రను ఆమెకు చాలా ఇష్టం.
సప్తమి గౌడకు వరుస ఆఫర్లు
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం.. మొదటి సినిమాతోనే… పాపులరై ఇండస్ట్రీని దున్నేస్తారు. ఇప్పుడు అచ్చం అలాగే… మరో 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలేలాగా మరో హీరోయిన్ రెడీ అవుతున్నారు. ఆ అందాల తార ఎవరో కాదు సప్తమి గౌడ ( Sapthami Gowda). కాంతారా సినిమాతో సౌత్ ఇండస్ట్రీ ని మొత్తం షేక్ చేశారు సప్తమి గౌడ.
తెలుగులో మరో రెండు సినిమాలు
ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించడమే కాకుండా అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి ఈ అందాల తార ఇప్పుడు నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. అయితే ఈ తమ్ముడు సినిమా జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. సప్తమి గౌడ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తమిళం, కన్నడ చిత్రాలలోనూ అవకాశాలు
తమ్ముడు (Thammudu ) సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా.. తన పాత్ర అదిరిపోతుందని వెల్లడించారు. ఎలాంటి సినిమాలు వచ్చిన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఆఫర్స్ తనకు వస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు సప్తమి గౌడ. పుష్ప సినిమాలో రష్మిక చేసిన పాత్ర తనకు చాలా నచ్చిందని… అలాంటి ఆఫర్లు వస్తే అసలు వదులుకోనని పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో మరో రెండు సినిమాలలో నటించబోతున్నట్లు వెల్లడించింది. తమిళం అటు కన్నడలో కూడా మూవీస్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. కానీ వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొంది.
తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో సప్తమి గౌడకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె భవిష్యత్తు కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.


