|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thammudu: భయపడి అడుగు ఆపకే.. ఆకట్టుకుంటోన్న ‘తమ్ముడు’ ఫస్ట్ సాంగ్

Published: 17-06-2025, 12:04 PM
Thammudu: భయపడి అడుగు ఆపకే.. ఆకట్టుకుంటోన్న 'తమ్ముడు' ఫస్ట్ సాంగ్

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ సినిమా ఫస్ట్ సింగిల్ ‘భూ అంటూ భూతం’ విడుదలైంది. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం, అనురాగ్, అక్షితల గానం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ.

Key Points

1

నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్

2

'భూ అంటూ భూతం' పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది

4

జూలై 4న 'తమ్ముడు' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల

‘తమ్ముడు’ ఫస్ట్ సింగిల్ విడుదల

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుంది. లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘భూ అంటూ భూతం’ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించగా.. ఈ పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు. సింహాచలం మన్నేలా లిరిక్స్ రాశారు. ‘భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ.. ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి.. పుట్టగానే నేరుగా నువ్వు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. జూలై 4న ‘తమ్ముడు’ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

పాట విశేషాలు

సినిమా విడుదల తేదీ

నితిన్, సప్తమి గౌడ నటించిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల కానుంది. ‘భూ అంటూ భూతం’ పాట ప్రేక్షకులను అలరిస్తున్నది. చిత్రయూనిట్ అంచనాలను అందుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.