
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ జులై 4న విడుదలైంది. అయితే, ఈ చిత్రం తొలిరోజు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్‌ను సాధించింది. నితిన్ కెరీర్‌లోనే ఇది అత్యంత తక్కువ టికెట్ సేల్స్.
Key Points
నితిన్ నటించిన తమ్ముడు సినిమాకు తొలిరోజు కలెక్షన్స్ దారుణంగా తగ్గాయి.
ఇండియాలో రూ. 2 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ. 3-4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
నితిన్ కెరీర్‌లోనే ఇది అత్యంత తక్కువ టికెట్ సేల్స్ రికార్డు.
ప్రీ-బుకింగ్స్‌లో 8.5K టికెట్లు అమ్ముడుపోగా, తొలిరోజు కేవలం 27K టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
తమ్ముడు సినిమాకు నెగటివ్ టాక్
టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తమ్ముడు సినిమాపై నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
అయితే, జులై 4న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమాకు కూడా నెగెటివ్ టాక్ వస్తోంది. ఆ ప్రభావం తమ్ముడు కలెక్షన్స్‌పై పడింది. తొలి రోజున తమ్ముడు సినిమాకు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో మొదటి రోజు తమ్ముడు సినిమాకు రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది.
దారుణమైన తొలిరోజు కలెక్షన్స్
అలాగే, వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద తమ్ముడు మూవీకి రూ. 3 నుంచి 4 కోట్ల రేంజ్‌లోనే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే, షేర్ కలెక్షన్స్ కోటిన్నర రూపాయలు కూడా దాటాయో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నితిన్ మూవీ తమ్ముడుకు రూ. 1.3 నుంచి 1.5 కోటి వరకు షేర్ కలెక్షన్స్ వచ్చే అవాకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ చూసిన అంతగా అంచనాలను అందుకోవడం లేదని సమాచారం.
నితిన్ కెరీర్ లో అత్యల్ప టికెట్ సేల్స్
వరల్డ్ వైడ్‌గా తమ్ముడు సినిమా 950 వరకు థియేటర్లలో విడుదలైంది. తమ్ముడు సినిమాకు ప్రీ బుకింగ్స్‌లో 8.5 వేల రేంజ్‌లో టికెట్స్ సేల్ కాగా తొలి రోజున ఈ మూవీకి కేవలం 27 వేల లోపే టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ లెక్కన నితిన్ రీసెంట్ టైమ్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ టికెట్స్ సేల్స్ అయి అభిమానులను తమ్ముడు నిరాశపరిచినట్లు అయింది.
ఇకపోతే తమ్ముడు సినిమాకు వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. తమ్ముడు మూవీలో వర్ష బొల్లమ్మ , సప్తమి గౌడ హీరోయిన్స్‌గా చేశారు. అలాగే, సీనియర్ హీరోయిన్ లయ , మలయాళ భామ స్వాసిక ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. దిల్ రాజు , శిరీష్ కలిసి తమ్ముడు సినిమాను నిర్మించారు.
నితిన్ మరియు దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతల చిత్రం ‘తమ్ముడు’ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందడం సినీ ప్రేక్షకులను నిరాశపరిచింది. భవిష్యత్తులో మెరుగైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.


