
రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే, సినిమా చూసిన ఓ యువతి భావోద్వేగంతో చున్నీ తీయడంపై చర్చ మొదలైంది. దీనిపై నిర్మాత ఎస్‌కేఎన్ గట్టిగా స్పందించారు. ఈ ఘటన, దానిపై ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Key Points
రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
సినిమా చూసి ఓ యువతి భావోద్వేగంతో చున్నీ తీసేసిన ఘటన వైరల్ అయింది.
నిర్మాత ఎస్‌కేఎన్ ఈ సంఘటనపై స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.
సినిమా సందేశం భయాన్ని పోగొట్టడమే కానీ, చున్నీలు ఎగరేయడం కాదని SKN స్పష్టం చేశారు.
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా సందేశం
రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend) మూవీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. అను ఇమాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలు పర్సనల్‌గా ప్రొఫెషనల్‌గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్నది ఈ సినిమా స్టోరీ. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ మూవీ తెగ నచ్చేస్తుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చూసిన అమ్మాయిలంతా థియేటర్స్‌లో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ఇటీవల డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తాజాగా ఓ థియేటర్‌కు వెళ్లాడు.
చున్నీ తీసిన అమ్మాయి ఎమోషనల్ ఘటన
అక్కడ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చూసిన ఓ అమ్మాయి నేరుగా రాహుల్ దగ్గరకు వచ్చి చాలా ఎమోషనల్ అయిపోయింది. అయితే మూవీలో రష్మిక ట్రైలర్‌లో వేసుకున్న డ్రెస్సులను ధరించి తన ఫ్రెండ్స్‌తో వచ్చినట్లు తెలిపింది. అలాగే చివర్లలో రష్మిక చున్నీ తీసేసినట్లు ఆ అమ్మాయి కూడా చున్నీ తీసేసింది. తాను కూడా లైఫ్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని.. ఇలాగే ఫేస్ చేస్తానని రాహుల్‌తో చెప్పుకొచ్చింది. దీంతో డైరెక్టర్ రాహుల్ ఆ అమ్మాయిని మెచ్చుకుని ఒక హగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో.. అది చూసిన వారంతా విమర్శలు చేస్తున్నారు.
ఎస్‌కేఎన్ స్ట్రాంగ్ కౌంటర్
ఈక్రమంలో.. తాజాగా, నిర్మాత ఎస్‌కేఎన్(SKN) స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ‘‘బంగారు తల్లులు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా తీసింది మీలో భయాన్ని పోగొట్టాలని. అంతేకానీ చున్నీలు ఎగరేయాలని కాదమ్మా. పొద్దున్నుంచి ధీరజ్ గారి ఆఫీస్ ముందు అందరూ బట్టల షాప్ వాళ్లు ఉన్నారు. మా చున్నీల సేల్స్ పడిపోతాయి అని. అందుకే మీ అందరికి ఒక మాట. చున్నీ వేసుకొని హ్యాపీగా సినిమా చూడండి. మీకు కంఫర్ట్ గా ఉంటె ఏ డ్రెస్ అయినా వేసుకోండి. భయాన్ని వదిలేయండి అని మాత్రమే ఈ సినిమా ద్వారా మెసేజ్ ఇచ్చాం. అంతేకాని వేరే ఏది వదిలేయమని కాదు’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు గట్టిగా ఇచ్చిపడేశావని అంటున్నారు.
మొత్తంమీద, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కేవలం వినోదం మాత్రమే కాకుండా, సమాజంలో ఒక ముఖ్యమైన చర్చకు తెరలేపింది. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు సినిమా అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయగా, ఇది ప్రేక్షకులలో మరింత ఆలోచన రేకెత్తించే అవకాశం ఉంది.


