
తిరువీర్, టీనా శ్రావ్య నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా నవంబర్ 7న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో $100K డాలర్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతోంది. ఈ విజయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
Key Points
తిరువీర్, టీనా శ్రావ్య నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది.
నార్త్ అమెరికాలో 100K డాలర్లకు పైగా వసూళ్లను సాధించి దూసుకుపోతోంది.
సినిమా విజయాన్ని సూచిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.
మౌత్ టాక్‌తో పాజిటివ్ రెస్పాన్స్ పొంది, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో: కథ, నటీనటులు
తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో మూవీ కలెక్షన్స్ అదిరిపోయినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు.
నార్త్ అమెరికాలో వసూళ్ల సునామీ
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నార్త్ అమెరికాలో మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దూసుకుపోతోంది.
ఇక నార్త్ అమెరికాలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా 100K డాలర్స్ కి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇది సింపుల్‌గా, ఆశ్చర్యకరంగా అనిపించే అరుదైన విజయం అని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.
విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ
మనం రోజు మన చుట్టూ ఉన్న వారిలో చూసే కామెడీ, ఆప్యాయత వంటి కోణాలను అతిశయోక్తిగా కాకుండా మనకు కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని చిత్రీకరించారు. సన్నివేశాల్లోని కామెడీ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనే అంశాలను సహజంగా చూపించారని పలు రివ్యూస్ వచ్చాయి.
విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా క్రమంగా ప్రేక్షకుల ఆదరణను కూడా పొందుతూ ఓవర్‌సీస్‌లో విజయవంతంగా రన్ అవుతోంది. నార్త్ అమెరికాలోని ఆడియెన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అవుతోంది. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్, భారీతనంతోనే కాకుండా నిజాయతీ, నైపుణ్యంతో మంచి కథ ఉంటే చాలని మరోసారి ఈ సినిమా నిరూపించింది.
భారీ బడ్జెట్ లేకుండానే మంచి కథ, నిజాయితీతో కూడిన నైపుణ్యం ఉంటే విజయం సాధించవచ్చని ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నిరూపించింది. ఓవర్సీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.


