
నటుడు నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘స్వయంభు’ సినిమా నుండి కొత్త పోస్టర్ మరియు టీజర్ అప్డేట్ విడుదల చేశారు. పోస్టర్ లో నిఖిల్ మరియు సంయుక్త యుద్ధ దృశ్యంలో కనిపిస్తున్నారు.
Key Points
నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా స్వయంభు సినిమా టీజర్ అప్డేట్!
అదిరిపోయే పోస్టర్ విడుదలై సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
నిఖిల్, సంయుక్త ప్రధాన పాత్రల్లో యుద్ధ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
భారీ సినిమాటిక్ అనుభవానికి సిద్ధం కావాలని మేకర్స్ ప్రకటన.
నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు వేడుకలు
కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ… కంటెంట్ ఓరియెంటెడ్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేసే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘స్వయంభు’(Swayambhu). ఇక టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి(Bharath Krishnamachari) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్(Bhuvan), శ్రీకర్(Srikar) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే నిఖిల్ సిద్ధార్థ్ సరసన సంయుక్త(Samyuktha Menon), నభా నటేష్(Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.
స్వయంభు సినిమా పోస్టర్ విడుదల
అయితే నేడు నిఖిల్ పుట్టిన రోజు కావడంతో స్పెషల్ పోస్టర్‌తో పాటు ‘స్వయంభూ’ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇక అందులో ‘స్వయంభూ బృందం వారి వారియర్ అయినటువంటి నిఖిల్‌కి EPIC పుట్టినరోజు శుభాకాంక్షలు.. Swayambhu టీజర్ త్వరలో విడుదల కానుంది.. Swayambhu యొక్క గంభీరమైన & శక్తివంతమైన ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి.. ఒక భారీ సినిమాటిక్ అనుభవం సిద్ధమవుతోంది.. సెంగోల్ తనదైన ముద్ర వేస్తుంది’ అని రాసుకొస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇక పోస్టర్‌లో నిఖిల్, సంయుక్త యుద్ధం చేస్తున్నారు. అలాగే వెనుక కూడా చాలా మంది వార్ చేస్తున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్‌లో ఓ గజస్థంభం ఉండగా దాని కొనకి నందీశ్వరుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
టీజర్ అప్డేట్ మరియు విడుదల తేదీ
A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)
నిఖిల్ సిద్ధార్థ్ అభిమానులకు ‘స్వయంభు’ నుండి ఈ పోస్టర్ మరియు టీజర్ అప్డేట్ ఖచ్చితంగా ఆనందాన్ని కలిగిస్తుంది. సినిమా విడుదలకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.


