|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ది ఇండియా హౌస్’ సెట్‌లో ప్రమాదం.. హీరో నిఖిల్ కీలక ప్రకటన

Published: 12-06-2025, 3:45 AM
‘ది ఇండియా హౌస్’ సెట్‌లో ప్రమాదం.. హీరో నిఖిల్ కీలక ప్రకటన

రామ్‌చరణ్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘ది ఇండియా హౌస్’ సినిమా షూటింగ్ సెట్‌లో ఓ ప్రమాదం జరిగింది. భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో సెట్‌ అంతా నీళ్ళతో నిండిపోయింది. ఈ ఘటనపై హీరో నిఖిల్ కీలక ప్రకటన చేశారు.

Key Points

1

‘ది ఇండియా హౌస్’ సెట్‌లో భారీ ప్రమాదం సంభవించింది.

2

వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో సెట్‌ నీటితో నిండిపోయింది.

4

నిఖిల్, మిగిలిన టీం సభ్యులు సురక్షితంగా ఉన్నారు.

సెట్‌లో భారీ ప్రమాదం

హీరో రామ్‌చరణ్‌ సమర్పణలో నిఖిల్‌ (Nikhil), సయీ మంజ్రేకర్‌ (Saiee Manjrekar) జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ది ఇండియా హౌస్‌’ (The Indian House)‌ మూవీ రామ్‌ వంశీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే నగర శివారు ప్రాంతమైన శంషాబాద్‌ (Shamshabad)లో సముద్రం ఎపీసోడ్ చిత్రీకరణకు గాను ఓ భారీ సెట్ వేశారు. అయితే, సీన్స్ షూట్ చేస్తుండగా.. భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో సెట్‌ అంతా నీళ్లతో అతలాకుతలమైంది.

ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యయి. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ది ఇండియా హౌస్’ మూవీ హీరో నిఖిల్ (Nikhil) కీలక ప్రకటన చేశాడు. తాము అంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డామని తెలిపాడు. కానీ కెమెరా డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి చాలా ఖరీదైన ఎక్విప్‌మెంట్ పూర్తిగా పాడయ్యాయని పేర్కొన్నాడు. ప్రమాదం నేపథ్యంలో షూటింగ్‌ను నిలిపివేశామని, తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే మూవీ నిర్మాత ప్రకటిస్తారని నిఖిల్ తెలిపాడు.

నిఖిల్ కీలక ప్రకటన

షూటింగ్‌ నిలిపివేత

ఈ ప్రమాదంతో ‘ది ఇండియా హౌస్’ షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ, అందరూ సురక్షితంగా ఉండటం మంచి విషయం. త్వరలోనే షూటింగ్‌ పునఃప్రారంభం అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.