
📌 Key Points
- విడుదలకు ముందే 1.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
- రూ. 4.31 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది.
- ఆంధ్రప్రదేశ్ నుంచే రూ. 3.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు.
- పాన్ ఇండియా స్థాయిలో 3 వేల షోలలో ప్రదర్శన.
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. విడుదల ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తూ, ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే రూ. 4.31 కోట్ల వసూళ్లతో షాక్ ఇస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల సునామీ
The Raja Saab Advance Bookings: తెలుగు సినిమా ది రాజా సాబ్..బాక్సాఫీస్ ప్రయాణాన్ని చాలా పాజిటివ్‌గా ప్రారంభించింది. సంక్రాంతి సందర్భంగా తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం జనవరి 9 విడుదలవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, మారుతి దాసరి దర్శకత్వం వహించారు. సినిమా అధికారికంగా విడుదల కాకముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. ట్రైలర్, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్.. ఎన్నో రోజుల తర్వాత.. కామెడీ యాంగిల్ లో కనిపిస్తూ ఉండడంతో.. ఆయన అభిమానులు ఈ చిత్రం కోసం తెగ ఎదురు చూస్తూ వచ్చారు..
అదే అంచనాలు కొనసాగిస్తూ..ది రాజా సాబ్ .అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలంగా ఉన్నాయి. మొదటి రోజు ముందే ఒక లక్ష యాభై వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా సుమారు 4.31 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో బ్లాక్ చేసిన సీట్లు లెక్కలోకి తీసుకోలేదు. అవి కలిస్తే విడుదల రోజున కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు మూడు వేల షోలలో ప్రదర్శితమవుతోంది. ప్రతి షోకి సగటున యాభై మందికిపైగా ప్రేక్షకులు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారీ మద్దతు లభించింది. అక్కడి నుంచి మాత్రమే సుమారు 3.5 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ వచ్చాయి. రాష్ట్రంలో వెయ్యికిపైగా షోలు ఉన్నాయి. చాలా షోలు దాదాపు హౌస్‌ఫుల్ అవ్వగా.. మిగతావి వేగంగా నిండుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు టికెట్ జీవో ప్రకటించకపోవడంతో అక్కడి లెక్కలు ఇంకా కౌంట్ లోకి. రాలేదు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూళ్లు
బ్లాక్ చేసిన సీట్లు కూడా కలిపితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే 6 కోట్ల రూపాయల మార్క్ దాటినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియర్ షోల టికెట్ ధరలు వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి. సాధారణ షోల టికెట్లు 250 నుంచి 370 రూపాయల మధ్య ఉన్నాయి. ఈ ధరలే సినిమాపై ఉన్న డిమాండ్‌ను చూపిస్తున్నాయి.
ఈ ఓపెనింగ్ ప్రభాస్‌కు చాలా కీలకం. ఆయన గత సినిమాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చినా..ప్రేక్షకుల్లో ఆయనపై నమ్మకం ఇంకా ఉంది. ఈ సినిమాలో ఎక్కువ భారం ప్రభాస్ మీదే ఉంది. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ది రాజా సాబ్ కు కలిసి వచ్చింది. ఒక పెద్ద తమిళ సినిమా వాయిదా పడటంతో ఇండియా..ఓవర్సీస్ మార్కెట్లలో పోటీ తగ్గింది.
ప్రభాస్‌కు కీలకం.. పోటీ లేకపోవడం కలిసొచ్చింది
ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే.. మొదటి వీకెండ్‌లో సినిమా భారీ ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి మొదటి షో రిజల్ట్‌పైనే ఉంది.
ది రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే, సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్‌ను సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రభాస్ స్టార్‌డమ్, పోటీ లేకపోవడం సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇది సినిమా విజయంపై భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.


