|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థియేటర్లలో ఈ వారం సందడి చేసే చిత్రాలు! ఏకంగా 9 సినిమాలు విడుదల!

Published: 02-02-2026, 12:35 AM
థియేటర్లలో ఈ వారం సందడి చేసే చిత్రాలు! ఏకంగా 9 సినిమాలు విడుదల!
  • ఈ వారం థియేటర్లలో 9 సినిమాలు విడుదల కానున్నాయి.
  • గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’ చిత్రం విడుదల కానుంది.
  • శ్రీ చిదంబరం గారు చిత్రం గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రానుంది.
  • అమర్దీప్ చౌదరి నటించిన చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేటర్లలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారం ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే చిత్రాల జాబితా

This week theatre release:ప్రతి నెల ఎలాగైతే ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయో అలాగే ప్రతి వారం కూడా కనీసం రెండు లేదా మూడు చిత్రాలైనా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధమవుతున్నాయి. అలా ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలా ఈవారం ఏకంగా తొమ్మిది చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మరి ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సమంత శాకుంతలం తర్వాత ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. ధురంధర్ సినిమాతో ఒక నైట్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సారా అర్జున్ ఇందులో లీడ్ రోల్ పోషిస్తోంది. భూమిక చావ్లా, గౌతమ్ మీనన్, నాజర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. యూత్ డ్రామా, థ్రిల్లర్, సామాజిక అంశాలను తెరపై చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ బారినపడి యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో డ్రగ్స్ తో పాటు మరికొన్ని సామాజిక అంశాలను తెరపైకి తీసుకొస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో గ్రామీణ ప్రేమ కథను తెరపై చూపిస్తూ తెరకెక్కుతున్న చిత్రం శ్రీ చిదంబరం గారు. గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత, గార్లపాటి తులసి, నాయుడు మొరం , అరుణ్ కుమార్, శంకర్రావు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చందు రవి ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. ఎం.ఎం.కీరవాణి ఒక పాట కూడా పాడారు. వినయ్ రత్నం దర్శకత్వంలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాల కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదల కానుంది.

యుఫోరియా చిత్రం గురించి వివరాలు

ఎం.ఎం.నాయుడు దర్శకత్వంలో విజయ్ మూవీ మేకర్స్ పతాకంపై కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ అమర్దీప్ చౌదరి, సాయిలి ఎం చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పంపిణీ చేస్తున్నారు. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తుండగా.. ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ చిత్రానికి సుమన్ బాబు సిహెచ్ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, సంజన శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ చిదంబరం గారు సినిమా విశేషాలు

5.లవర్స్ క్రైమ్ 6.బ్లడ్ రోజస్ 7.హనీ 8.లగ్గం టైం 9.విత్ లవ్ వంటి చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి.

ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాయో వేచి చూడాలి. అన్ని రకాల జానర్లలో సినిమాలు విడుదలవుతుండటంతో ప్రేక్షకులకు మంచి వినోదం లభించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.