|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అనిరుధ్ పాట కాపీ ఆరోపణలు! నాని సినిమాకు చిక్కులు తెచ్చిన ట్యూన్?

Published: 23-02-2026, 9:35 AM
షాకింగ్: అనిరుధ్ పాట కాపీ ఆరోపణలు! నాని సినిమాకు చిక్కులు తెచ్చిన ట్యూన్?
  • అనిరుధ్ రవిచందర్ తన పాట ట్యూన్‌ను తానే కాపీ చేశాడని ఆరోపణలు.
  • గతంలో హిట్ అయిన ట్యూన్స్ ఇతర ఇండస్ట్రీలలో కాపీ చేసే సంప్రదాయం ఉంది.
  • నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్’ చిత్రం నుండి ‘ఆయా షేర్’ పాట విడుదల కానుంది.
  • ‘ఆయా షేర్’ పాట ప్రోమో విడుదల చేయగా, ఇది కాపీ ట్యూన్ అని విమర్శలు వస్తున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలోని ‘ఆయా షేర్’ పాటను ఆయన కాపీ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అనిరుధ్‌పై కాపీ ఆరోపణలు

Aaya Sher Song: కాదేదీ కవితకు అనర్హం అని అంటుంటారు. సినిమా ఇండస్ట్రీకి, మరీ ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చే సరికి ఈ కవితను ఇలా కూడా చెప్పుకోవచ్చు.. ‘కాదేదీ కాపీకి అనర్హం’ అని. అవును, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఏదో ఒక చోట కాపీ చేస్తూనే ఉంటారు. కాపీ ట్యూన్స్ ఇస్తూనే ఉంటారు. ఇందులో ఎక్కువగా థమన్ (S Thaman) పేరు బాగా వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు బక్కోడు అని టాలీవుడ్ ఇండస్ట్రీ పిలుచుకునే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) కూడా ఈ లిస్ట్‌లో చేరారు. మరో విశేషం ఏమిటంటే, తన సాంగ్‌ ట్యూన్‌ని తానే కాపీ చేయడం. గతంలో టాలీవుడ్‌లో హిట్ అయిన సాంగ్స్ ట్యూన్‌ని కోలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కాపీ చేసుకునేవారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ జరుగుతుందనుకోండి. కానీ, సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత, టెక్నాలజీ బాగా అప్డేట్ అయిన తర్వాత కూడా.. ఎవరికీ తెలియదులే అని చాలా కాన్ఫిడెంట్‌గా కాపీ చేసి వదులుతున్నారంటే.. వారి ఘట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

‘ది ప్యారడైజ్’ చిత్రం నుండి ‘ఆయా షేర్’ పాట విడుదల

ఒక మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిబిలిటీ తెలిసేది అతని ఒరిజినల్ మ్యూజిక్‌తోనే. ఒక్కసారి కాపీ అనే ముద్ర పడితే, అతను ఒరిజినల్‌గా కంపోజ్ చేసినా, ఇది ఎక్కడో లేపాశాడురా? అనేలా కామెంట్స్ ఫేస్ చేయక తప్పదు. ఇప్పుడు థమన్ విషయంలో అదే జరుగుతుంది. ఇక బక్కోడు అనిరుధ్ విషయానికి వస్తే.. కోలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన ఈ కుర్రాడిని, ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. స్టార్ హీరో సినిమా అనౌన్స్ అయితే చాలు, అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేయండి అంటూ అభిమానులు చిత్రయూనిట్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో అనిరుధ్ అడ్డంగా దొరికేయడంతో.. సోషల్ మీడియా అంతా మనోడి గురించే టాక్ నడుస్తోంది. అసలింతకీ అనిరుధ్ కాపీ చేసిన సాంగ్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

కాపీ ట్యూన్స్ పట్ల నెటిజన్ల స్పందన

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ మూవీ నుంచి ‘ఆయా షేర్’ (Aaya Sher Song) అనే సాంగ్ రాబోతున్న విషయం తెలిసిందే. నాని పుట్టినరోజైన ఫిబ్రవరి 24న ఈ సాంగ్‌ని చిత్ర టీమ్ విడుదల చేయబోతుంది. ఈలోపు అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి ఈ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రోమో విన్నవారందరికీ.. ఈ ట్యూన్, సాంగ్ ఎక్కడో విన్నట్టే అనిపించడంతో.. సెర్చింగ్ మొదలెట్టారు. అలా సెర్చింగ్‌లో గతంలో అనిరుధ్ సంగీతం అందించిన విజయ్ సేతుపతి చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’ (Kanmani Rambo Khatija) మూవీలోని ‘డిప్పమ్ డప్పమ్’ సాంగ్‌ని లిరిక్స్ మార్చి యాజీటీజ్‌గా దించేసినట్లుగా కనిపెట్టడంతో.. బక్కోడు అడ్డంగా బుక్కయ్యాడు. పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ఇలా కాపీ మ్యూజిక్ ఇచ్చి, సినిమా పరువు తీసేశాడంటూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. మరి ఈ కాపీ వార్తలపై అనిరుధ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

అనిరుధ్ కాపీ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ‘ఆయా షేర్’ పాట విడుదల తర్వాతైనా ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.