|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇదే మా శాశ్వత నివాసం… మా భవిష్యత్తు కళ్లెదుట.. బుల్లితెర జంట ఎమోషనల్‌

Published: 18-10-2025, 3:19 AM
ఇదే మా శాశ్వత నివాసం... మా భవిష్యత్తు కళ్లెదుట.. బుల్లితెర జంట ఎమోషనల్‌

బుల్లితెర పాపులర్ జంట ప్రియాంక జైన్, శివకుమార్ వారి కలను నిజం చేసుకున్నారు. హైదరాబాద్‌లో సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. కోటి రూపాయల లోన్‌తో కడుతున్న ఈ ఇల్లు తమ శాశ్వత నివాసం, భవిష్యత్తుకు పునాది అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. వారి ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Key Points

1

బుల్లితెర జంట ప్రియాంక జైన్, శివకుమార్ హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టుకుంటున్నారు.

2

కోటి రూపాయల లోన్‌తో తమ కలల ఇంటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

4

మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్‌తో వీరిద్దరూ పాపులారిటీ సంపాదించారు.

ప్రియాంక-శివకుమార్ కలల ఇంటి నిర్మాణం

ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇప్పుడీ రెండు పనులు భుజానేసుకున్నారు బుల్లితెర జంట ప్రియాంక జైన్‌ ( Priyanka Jain )- శివకుమార్‌ ( Shivakumar ). కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ పెళ్లిని ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలని డిసైడయ్యారు. ఈ ఏడాదే పెళ్లి అని ప్రకటించారు.. కానీ అది వాయిదా పడేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం మరో ముఖ్యమైన పని మీద పడ్డారు.

గతేడాది ల్యాండ్‌ కొన్న జంట ప్రస్తుతం అద్దె ఇంట్లో కలిసుంటున్న ప్రియాంక -శివ్‌ గతేడాది హైదరాబాద్‌లో ల్యాండ్‌ కొన్నారు. భూమి కొని.. అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ మజాయే వేరంటూ 2024 ఏప్రిల్‌లో భూమి కొని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఆ విషయాన్ని ఈ ప్రేమపక్షులు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కోటి రూపాయల లోన్‌తో ఇల్లు కట్టుకుంటున్నట్లు తెలిపారు.

మా ఫ్యూచర్‌ కళ్లముందు: జంట ఎమోషనల్‌ పోస్ట్

మా ఫ్యూచర్‌ కళ్లముందు.. ఇది కేవలం ఇటుకలతో కాదు, ఎన్నో ఆశలు, కలలతో నిర్మితమవుతోన్న ఇల్లు. నిలువైన గోడల్ని చూస్తుంటే మా భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ఇంటికి పునాది పడలేదు. జీవితకాల జ్ఞాపకాల సమాహారానికి పునాది పడింది. ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడ అందమైన జ్ఞాపకాలను కూడబెట్టుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఇది మా శాశ్వత నివాసం అని రాసుకొచ్చింది.

సీరియల్స్‌తో పాపులారిటీ ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు ప్రియాంక-శివ్‌ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా వీరిద్దరూ మౌనరాగం సీరియల్‌లో జంటగా నటించారు. అప్పుడే వీరి పరిచయం ప్రేమగా మారింది. జానకి కలగనలేదు సీరియల్‌తో ప్రియాంక మరింత పాపులారిటీ సంపాదించింది. తర్వాత తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొంది. టాప్‌ 5లో ఒకరిగా నిలిచింది. శివకుమార్‌ ప్రస్తుతం తెలుగులో ఓ సీరియల్‌ చేస్తున్నాడు.

సీరియల్స్‌తో పాపులారిటీ: వారి ప్రయాణం

ప్రియాంక, శివకుమార్ తమ కలల ఇంటిని నిర్మిస్తూ, కొత్త జీవిత అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వారి ఈ అద్భుత ప్రయాణం సంతోషకరమైన జ్ఞాపకాలను నింపాలని అభిమానులు, శ్రేయోభిలాషులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.