|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ వారం థియేట‌ర్, ఓటీటీలోకి వ‌చ్చే తోపు సినిమాలు ఇవే

Published: 09-11-2025, 2:36 PM
ఈ వారం థియేట‌ర్, ఓటీటీలోకి వ‌చ్చే తోపు సినిమాలు ఇవే

ఈ వారం సినీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా పలు ఆసక్తికర సినిమాలు విడుదల కానున్నాయి. డ్యూడ్, థామా, సిద్దు జొన్నలగడ్డ సినిమా, బైసన్ వంటి చిత్రాలు ఓటీటీలో రాగా, దుల్కర్ సల్మాన్ కాంత మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.

Key Points

1

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమా నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

2

సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం నవంబర్ 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో.

4

దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన 'కాంత' సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల.

ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు

దిశ‌, వెబ్ డెస్క్: ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్ తో పాటు ఓటీటీలో కూడా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గత వారం కంటే ఈ సారి బంపర్ హిట్ సినిమాలే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ లిస్టులో డ్యూడ్‌ లాంటి బంపర్ హిట్ సినిమా కూడా ఉంది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ ( Dude OTT) సినిమా మొన్న అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా దాదాపు రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా నవంబర్ 14వ తేదీన నెట్ ఫ్లిక్స్‌ లో రిలీజ్ కాబోతుంది. అటు సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ తెలుసు కదా. ఈ సినిమా కూడా దీపావళికి రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేసిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోనే నవంబర్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక నేషనల్ రష్మిక మందాన బేతాళిగా నటించిన లేటెస్ట్ సినిమా థామా. ఈ సినిమా కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 14వ తేదీనే ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ బైసన్. అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంలో బంపర్ హిట్ అందుకుంది. తెలుగులో పెద్దగా ఎక్కలేదు. అయితే ఈ సినిమా కూడా నవంబర్ 14వ తేదీన నెట్ ఫ్లిక్స్‌ లోనే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నాలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానుండగా దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన కాంత మూవీ ( Kaantha ) నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

థియేటర్లలో సందడి చేయనున్న కొత్త సినిమాలు

ప్రముఖ హీరోల లేటెస్ట్ మూవీ అప్డేట్స్

మొత్తం మీద ఈ వారం సినీ లవర్స్‌కు ఓటీటీ, థియేటర్లలో వినోదాన్ని పంచే చిత్రాలు చాలానే ఉన్నాయి. మీ అభిరుచికి తగ్గట్టుగా నచ్చిన సినిమాను ఎంపిక చేసుకొని ఎంజాయ్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.