
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన ‘బైసన్’ సినిమా దీపావళికి విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారి సెల్వరాజ్ ధృవ్ కష్టంపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ధృవ్ రెండు సంవత్సరాలు వేచి ఉండి, సినిమా కోసం ఎంతగానో శ్రమించాడని సెల్వరాజ్ వివరించారు.
Key Points
ధృవ్ విక్రమ్ 'బైసన్' మూవీతో దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమా కోసం ధృవ్ విక్రమ్ రెండేళ్లు వేచి ఉండి, చాలా కష్టపడ్డాడని దర్శకుడు మారి సెల్వరాజ్ తెలిపారు.
ధృవ్ అంకితభావం, కష్టాన్ని చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని మారి సెల్వరాజ్ పేర్కొన్నారు.
ధృవ్ విక్రమ్ కష్టానికి మారి సెల్వరాజ్ ప్రశంసలు
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ ‘బైసన్’(Bison) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం మారి సెల్వరాజ్(Mari Selvaraj) దర్శకత్వంలోరాబోతుండగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)హీరోయిన్‌గా నటిస్తోంది. రెజిషా విజయన్, పశుపతి, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టేడియోస్ నిర్మిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్లొన్న మారి సెల్వరాజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘‘జీవితంలో విజయం సాధించి పెద్ద స్థాయికి చేరుకోవాలంటే.. నటుడికి కోరిక ఉండాలి.
‘బైసన్’ మూవీ విడుదల తేదీ, నటీనటులు
విక్రమ్ సర్ కొడుకు ఎలా ఉంటాడనే దాని గురించి మా మధ్య చర్చ జరిగింది. మేము అప్పుడు విక్రమ్ సర్‌తో మాట్లాడాము.. నేను అతనితో ఓ సినిమా తీయడం సాధారణ విషయం కాదు. అతను నాతో ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేయాలి. నేను ధృవ్‌కి శిక్షణ ఇస్తాను. అతను నన్ను నమ్మి రావాలి. మధ్యలో అతను వేరే సినిమా చేయలేడు అని చెప్పాను. అయినప్పటికీ పంపించారు. ఇది చాలా బాధాకరం. నా ప్రాజెక్ట్ కోసం అతను రెండు సంవత్సరాలు వేచి ఉన్నాడు. సినిమా మొదలుపెట్టినప్పుడు ధ్రువ్ చాలా కష్టపడ్డాడు.
ధృవ్ కోసం మారి సెల్వరాజ్ ప్రణాళిక, భావోద్వేగ క్షణాలు
దీంతో నేను మనం వేరే కథ చేద్దామని చెప్పాను. అప్పడు అతను.. అవును, ఇది చాలా కష్టం.. కానీ నువ్వు ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నావు కదా ఇది నీ కలల ప్రాజెక్ట్ లాంటిది. నేను నిన్ను నా తండ్రిలా భావిస్తాను కాబట్టి ‘బైసన్’ చేద్దాం. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావని నేను నమ్ముతున్నాను అనడంతో ఆ మాటలు నన్ను కదిలించాయి’’ అని చెప్పుకొచ్చారు.
మారి సెల్వరాజ్ వ్యాఖ్యలు ధృవ్ విక్రమ్ అంకితభావాన్ని స్పష్టం చేశాయి. ‘బైసన్’ చిత్రం కోసం ధృవ్ పడిన కృషి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.


