
భారీ అంచనాల మధ్య జూన్ 5న విడుదల కానున్న ‘థగ్ లైఫ్’ సినిమా గురించి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ, ఈ సినిమాను ‘చాలా గొప్ప సినిమా’ అని అభివర్ణించారు. సినిమాలో త్రిష, శింబు కీలక పాత్రలు పోషించారు.
Key Points
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమాను 'చాలా గొప్ప సినిమా' అని ప్రశంసించారు.
జూన్ 5న విడుదల కానున్న ఈ సినిమాలో త్రిష, శింబు కీలక పాత్రలు పోషించారు.
వైజాగ్లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది.
కమల్ హాసన్ తన తెలుగు సినీ ప్రయాణం మరియు 'థగ్ లైఫ్' సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘థగ్ లైఫ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు, 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా నడవలేని ఫ్యాన్ బేస్ ని ‘మరో చరిత్ర’ అనే చిత్రం ఇచ్చింది. తర్వాత ఏక్ తుజే కేలియే సినిమా చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు మన కుర్రాడు హిందీకి వెళ్లి కొట్టాడురా అని అభినందించారు. అలాంటి వైజాగ్లో సాగర సంగమం, ఏక్ తుజే కేలియే శుభసంకల్పం సినిమాలు చేశాను. ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను. అలాగే నేర్చుకున్నాను. నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. అయితే నా బ్యాడ్ ఫిలిమ్స్ మర్చిపోయి కేవలం మంచి సినిమాలనే గుర్తుపెట్టుకున్నా. రు అందుకుగాను మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి సినిమాలు మీకు అందించడం నా బాధ్యత. నేను 15 తెలుగు సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. అది విజయాల్ని మీరే ఇచ్చారు. ప్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను. ఇది నిజం. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి “థగ్ లైఫ్” సినిమా మీకు అందిస్తున్నాను. ఒక కళాకారుడు చేసే పని ఇదే ఇది. చాలా గ్రేట్ ఫిలిం ఇది. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించారు. అభిరామి అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. నాజర్ గారితో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పెర్ఫార్మెన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము అనుకున్నది కరెక్టా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్ లో కలుద్దాం’’. అని అన్నారు.
హీరో శింబు మాట్లాడుతూ ‘‘జూన్ 5న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. జూన్ 5న మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఓజీలో ఒక పాట పాడాను. ఆ పాట త్వరలోనే రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఎప్పటినుంచో ఒక పాట పాడాలని ఉండేది. అది ఓజీ తో తీరింది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్.’’ అని అన్నారు
కమల్ హాసన్ తెలుగు సినిమాపై అభిప్రాయాలు
హీరోయిన్ త్రిష మాట్లాడుతూ … ‘‘వర్షం సినిమా రిలీజ్ 22 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వైజాగ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కమల్‌గా కమల్ హాసన్‌తో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంద్రాణి అనే క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఆడియన్స్‌కి గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు.’’ అని అన్నారు
నాజర్ మాట్లాడుతూ.. ‘‘థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఫిల్మ్ అవుతుంది. వైజాగ్ లోనే కమలహాసన్ చాలా రోజుల ముందు ఒక చరిత్ర రాశారు. అదే మరో చరిత్ర. ఇప్పుడు మరో చరిత్రగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా ఇండియాలో ద బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం, ద బెస్ట్ రెహమాన్, బెస్ట్ యాక్టర్ కమలహాసన్.. ఇలా ద బెస్ట్ టీం కలిసి చేస్తున్న సినిమా ఇది. కమల్ హాసన్, మణిరత్నం 37 ఏళ్ల తర్వాత కలిసి ఒక యాగంలా ఈ సినిమా చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీ. ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూడాలి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం.’’ అని అన్నారు
‘థగ్ లైఫ్’ నటీనటుల ప్రతిభ
అభిరామి మాట్లాడుతూ ‘‘చెప్పవే చిరుగాలి సినిమా ఇక్కడే షూటింగ్ చేశాం. వైజాగ్ నాకు చాలా స్పెషల్. మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చిన తెలుగు తెలుగు ప్రేక్షకులు దాన్ని ఘనవిజయం చేస్తారు. ఈ సినిమా నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మణిరత్నం కమల్ హాసన్ ఏఆర్ రెహమాన్, శింబు ఇలాంటి లెజెండ్స్‌తో వర్క్ చేయడం ఒక డ్రీమ్. జూన్ 5వ తేదీన అందరూ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా’’ అని పిలుపునిచ్చారు.
నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ వైజాగ్ అంటే మా కమలహాసన్‌కి వెరీ స్పెషల్. కమల్ హాసన్ సినిమాల్ని ఇక్కడ ఎంతగానో ఆదరిస్తారు. అందుకే ఈ వేడుకని ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడం జరిగింది. జూన్ 5న ఈ సినిమాని చూసి ఘనవిజయం చేస్తే కమల్‌ని ఇక్కడికి తీసుకొచ్చి సక్సెస్ మీట్ నిర్వహిస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమా 100% సూపర్ డూపర్ హిట్.’’ అని అన్నారు.
మొత్తంమీద, ‘థగ్ లైఫ్’ సినిమాపై కమల్ హాసన్ ప్రశంసలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.


