
కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5న విడుదలైంది. ఈ సినిమాపై అంచనాలు అధికంగా ఉన్నప్పటికీ, సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. తొలిరోజు వసూళ్లు ఎంత వచ్చాయో చూద్దాం.
Key Points
కమల్ హాసన్, మణిరత్నం కాంబో సినిమా 'థగ్ లైఫ్' రిలీజ్.
తెలుగు, తమిళ రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన.
తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కలెక్షన్స్.
‘థగ్ లైఫ్’ తొలిరోజు వసూళ్లు
కమల్ హాసన్ దిగ్గజ నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ‘విక్రమ్’ తప్పితే ఆయన కెరీర్‌లో గత కొన్నేళ్లలో సరైన హిట్ అన్నది లేదు. దీంతో ‘థగ్ లైఫ్’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భాష వివాదం వల్ల కర్ణాటకలో పూర్తిగా ఈ మూవీని రిలీజ్ చేయనని తెగేసి చెప్పాడు. దీంతో తెలుగు-తమిళ భాషల్లో నిన్న(జూన్ 5) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ దీనికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్? సోషల్ మీడియాలో టాక్ ఏం నడుస్తోంది?
కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో మూడు దశాబ్దాల క్రితం ‘నాయకుడు’ అనే సినిమా వచ్చింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లాసిక్‌గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే హీరో-దర‍్శకుడు కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారనేసరికి హైప్ ఏర్పడింది. ‘థగ్ లైఫ్’ ట్రైలర్ కూడా బాగుండేసరికి కమల్ హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా టాక్ మారిపోయింది.
సోషల్ మీడియాలో స్పందన
తెలుగు, తమిళంలో ఎక్కడా కూడా కమల్ ‘థగ్ లైఫ్’ చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ఘోరమైన ఫ్లాప్. కానీ ఈ చిత్రానికి తొలిరోజు రూ.25 కోట్ల వరకు వచ్చాయి. ‘థగ్ లైఫ్’కి మాత్రం వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు.
‘థగ్ లైఫ్’ విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్‌స్టర్. తల్లిదండ్రులు కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన నేర సామ్రాజ్యానికి కీలకంగా మారుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శక్తిరాజు-అమర్ మధ్య గొడవలు వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ కథలో త్రిష పాత్రేంటి? అనేది మిగతా స్టోరీ.
కమల్ హాసన్-మణిరత్నం కాంబో సక్సెస్?
మొత్తంమీద, ‘థగ్ లైఫ్’ సినిమా తొలిరోజు వసూళ్లు ఆశించినంతగా లేవు. కమల్ హాసన్, మణిరత్నం కాంబో సినిమా ఇంత తక్కువ వసూళ్లు సాధించడం నిరాశపరిచే విషయం.


