
తమిళం-కన్నడ భాషలపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో కర్ణాటకలో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీని ఫలితంగా ఆయన నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలపై కన్నడ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
Key Points
కమల్ హాసన్ తమిళం-కన్నడ భాషలపై వ్యాఖ్యలకు కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత.
కన్నడ సంఘాలు 'థగ్ లైఫ్' సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్నాయి.
సినిమా విడుదల చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరిక.
కమల్ హాసన్ అరెస్టు చేయాలని కన్నడ సంఘాల డిమాండ్.
కమల్ హాసన్ పై కర్ణాటకలో వ్యతిరేకత
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై కర్ణాటక వ్యాప్తంగా వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్ లైఫ్‌ను కర్ణాటకలో విడుదల చేయకండి అంటూ కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్‌లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ సినిమా ఎట్టిపరిస్థితిల్లోనూ ఇక్కడ రన్ చేసేది ఉండదని వారు పేర్కొన్నారు.
కమల్‌ని అరెస్టు చేయాలి కమల్ హాసన్‌ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు వాటాల్ నాగరాజు, సంఘాల నేతలు కమల్ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు.
‘థగ్ లైఫ్’ సినిమా విడుదలపై ఆందోళన
కన్నడ సంఘాల హెచ్చరికలు
కమల్ హాసన్ వ్యాఖ్యలకు కర్ణాటకలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. కన్నడ సంఘాల పోరాటం ఎలా ముగుస్తుందో చూడాలి.


