|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thulasi Nair: వామ్మో కడలి హీరోయిన్ ను చూశారా.. ఇలా మారిపోయారేంటీ?

Published: 13-12-2025, 3:48 AM
Thulasi Nair: వామ్మో కడలి హీరోయిన్ ను చూశారా.. ఇలా మారిపోయారేంటీ?
  • నటి రాధ చిన్న కుమార్తె తులసి నాయర్ ‘కడలి’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.
  • సినిమాల్లో ఆశించిన విజయం సాధించలేక తులసి ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
  • ఇటీవల తులసి నాయర్ తన అమ్మమ్మ అంత్యక్రియల్లో కనిపించింది.
  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రముఖ సినీ నటి రాధ కుమార్తె, ‘కడలి’ ఫేమ్ తులసి నాయర్ గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల తన అమ్మమ్మ అంత్యక్రియలలో కనిపించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలలో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.

తులసి నాయర్ సినీ ప్రస్థానం

Thulasi Nair: తులసి నాయర్ అంటే ప్రేక్షకులకు టక్కున ఈమె గుర్తుకు రాకపోవచ్చు కానీ ప్రముఖ సినీ నటి రాధా (Radha)కుమార్తె అంటే మాత్రం అందరికీ గుర్తుకు వస్తారు. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఓ వెలుగు వెలిగిన వారిలో రాధ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి రాధా కాంబినేషన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇలా రాధా కుమార్తెగా తన ఇద్దరు కూతుర్లు కార్తిక, తులసి ఇండస్ట్రీకి హీరోయిన్లుగా పరిచయమయ్యారు. కానీ వీరిద్దరూ మాత్రం ఇండస్ట్రీలో అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయారు.

ఇక కార్తిక ఇండస్ట్రీలో సక్సెస్ కానీ నేపథ్యంలో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అయితే ఈమె హోటల్ బిజినెస్ లో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఇక రాదా చిన్న కుమార్తె తులసి విషయానికి వస్తే ఈమె మణి రత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన కడలి(Kadali) అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మణిరత్నం సినిమా అంటేనే సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే మొదటి సినిమా ద్వారా తులసి అనుకున్న విధంగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ సినిమా తర్వాత ఈమె హీరోయిన్ గా యాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో తులసి కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

సినిమాలకు దూరంగా తులసి

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె కుటుంబ వ్యాపారాలలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాకి కూడా కార్తీక, తులసి ఇద్దరు దూరంగా ఉంటున్నారు కానీ ఇటీవల తులసి నాయర్(Thulasi Nair) కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఈమె గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అసలు ఏంటి ఇక్కడ రాదా చిన్న కుమార్తె తులసినేనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుపట్టలేనంతగా ఈమె అధిక శరీర బరువు ఉన్న నేపథ్యంలో తులసి సాధారణంగానే శరీర బరువు పెరిగిపోయారా? లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

గుర్తుపట్టలేని స్థితిలో రాధా కుమార్తె..

వైరల్ ఫోటోతో అభిమానులు షాక్

ఇలా ఉన్నఫలంగా ఈమె అధిక శరీర బరువు పెరిగి గుర్తుపట్టలేని లుక్ లో కనిపించడంతో రాధా అభిమానులు కూడా షాక్ లో ఉన్నారు. మీడియాకు దూరంగా ఉన్న తులసి ఇటీవల తన అమ్మమ్మ మరణించడంతో అమ్మమ్మ అంతక్రియల్లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే కెమెరా కంటికి చిక్కడంతో ఈమెకు సంబంధించిన ప్రస్తుత ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా ఉన్నఫలంగా తులసి శరీర బరువు పెరగడానికి కారణం ఏంటనేది తెలియదు కానీ, ఈమె మాత్రం మంచి ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తులసి నాయర్ ఫోటోలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆమె బరువు పెరగడానికి కారణం ఏంటని, ఆమె ఆరోగ్యంగా ఉన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.