
📌 Key Points
- ఘట్టమనేని వారసుడిగా జయకృష్ణ తెరంగేట్రం
- శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల చేసిన మహేష్ బాబు
- ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం
- ప్రేమ, యాక్షన్ కలగలిపిన కథాంశం
సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు గారి కుమారుడు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. తొలి సినిమాతోనే జయకృష్ణ ఆకట్టుకుంటున్నాడు.
జయకృష్ణ ఎంట్రీ అదుర్స్!
Srinivasa Mangapuram Teaser: ఘట్టమనేని కుటుంబం నుంచి ఇప్పటికే రెండు తరాలు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే .మూడోతరం ఎంట్రీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు దివంగత రమేష్ బాబు కొడుకుగా జయకృష్ణ (Jayakrishna)అందరికీ ఎంతో సుపరిచితమే. జయ కృష్ణ హీరోగా శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi)దర్శకత్వంలో ఘట్టమనేని వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. శ్రీనివాస మంగాపురం పేరిట ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్ చూస్తుంటే ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ సినిమాగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఎలాంటి కష్టాలు పడ్డారు తన ప్రేయసి మంగ కోసం వాసు మంగ తల్లిదండ్రులను ఎలా ఎదిరించారు అనేది ఈ టీజర్ వీడియోలో చూపించారు.
టీజర్ విశేషాలు
ఇక ఈ టీజర్ లో భాగంగా ఘట్టమనేని జయకృష్ణ నటన అద్భుతంగా ఉందని చెప్పాలి ఇతని నటన ,హావభావాలు చూస్తుంటే ఇది మొదటి సినిమా అనే భావన ఎవరికి కలగదు. తన యాక్టింగ్ తో అదరగొట్టారు. మంగ పాత్రలో రాషా తడాని నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ ,సీనియర్ నటుడు నరేష్ ,మోహన్ బాబు వంటి కీలక నటులు భాగం కాబోతున్నారు ముఖ్యంగా మోహన్ బాబు విలన్ పాత్ర సినిమాకు హైలెట్ కాబోతుందని తెలుస్తోంది. ఈ టీజర్ వీడియోలో మోహన్ బాబు ఎంట్రీ కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. మొత్తానికి ఘట్టమనేని హీరోకి అద్భుతమైన కథతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక జయకృష్ణ నటించిన ఈ సినిమా టీజర్ తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ సంగీతం అందించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఘట్టమనేని వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ జయ కృష్ణ ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక నటి రాషా తడాని(Rasha Tadani) ప్రముఖ నటి రవీనాటాండన్ కూతురిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
మొత్తానికి ఘట్టమనేని వారసుడు జయకృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాతో జయకృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


