|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థండర్‌బోల్ట్స్ రివ్యూ.. విలన్లే సూపర్ హీరోలు అయితే.. ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?

Published: 29-09-2025, 9:43 AM
థండర్‌బోల్ట్స్ రివ్యూ.. విలన్లే సూపర్ హీరోలు అయితే.. ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?

మార్వెల్ నుండి వచ్చిన “థండర్‌బోల్ట్స్” సినిమా రివ్యూ. విలన్లే సూపర్ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Key Points

1

మార్వెల్ యాంటీ హీరోలు థండర్‌బోల్ట్స్‌గా మారి ప్రజలను కాపాడే కాన్సెప్ట్.

2

ఎరిక్ పియర్‌సన్ రచన, జేక్ స్క్రీయర్ దర్శకత్వం వహించిన చిత్రం.

4

జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న యాక్షన్ థ్రిల్లర్.

కథ, కథనం ఎలా ఉన్నాయి?

మార్వెల్ సినిమాలకు వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఆ సినిమా బజ్ క్రియేట్ చేసిన చేయకపోయినా థియేటర్లకు యావరేజ్‌గా ఆడియెన్స్ వెళ్తుంటారు. ఇంత క్రేజ్ ఉన్న మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఒకటి థండర్‌బోల్ట్స్*.

ఇదివరకు మార్వెల్ సినిమాల్లో సూపర్ హీరోలకు విలన్స్‌గా ఉన్నవాళ్లు ఒక టీమ్‌గా ఏర్పడి ప్రజలను కాపాడే సూపర్ హీరోలుగా అదరగొట్టే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ఈ థండర్‌బోల్ట్స్. ఎరిక్ పియర్‌సన్ రచించిన ఈ సినిమాకు జేక్ స్క్రీయర్ దర్శకత్వం వహించారు.

ఫ్లొరెన్స్ ఫగ్, లెవిస్ పుల్‌మ్యాన్, వ్యాట్ రస్సెల్, డేవిడ్ హార్బర్, సెబాస్టియన్ స్టాన్, హన్నా జాన్-కమెన్, జులియా లూయిస్ కీలక పాత్రలు పోషించిన థండర్‌బోల్ట్స్ జియో హాట్‌స్టార్‌ లో తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి థండర్‌బోల్ట్స్ ఓటీటీ రివ్యూ లో తెలుసుకుందాం.

యాంటీ హీరోలుగా ఉన్న బ్లాక్ విడో (ఫ్లొరెన్స్ ఫగ్), రెడ్ గార్డియన్ (డేవిడ్ హార్బర్), కెప్టెన్ అమెరికా (వ్యాట్ రస్సెల్), వింటర్ సోల్జర్ (సెబాస్టియన్ స్టాన్), ఘోస్ట్ (జనా జాన్-కమెన్) ఒక్కో పని చేసుకుంటారు. వాలెంటినా (జూలియా లూయిస్) ఇచ్చిన అసైన్‌మెంట్‌లను పూర్తి చేసే కిల్లర్స్‌గా బ్లాక్ విడో, కెప్టెన్ అమెరికా, ఘోస్ట్ పని చేస్తుంటారు.

నటీనటుల పనితీరు, టేకింగ్

ఓ క్రమంలో ఈ ముగ్గురిని చంపేందుకు వాలెంటినా ట్రాప్ చేస్తుంది. ఆ ట్రాప్‌లో ఈ ముగ్గురితోపాటు బాబ్ (లెవిస్ పుల్‌మ్యాన్) అనుకోకుండా ఇరుక్కుంటాడు. తర్వాత ఇది వాలెంటినా వేసిన ట్రాప్ అని అంతా కనిపెట్టి బయటపడతారు.

ఆ తర్వాత వీరంతా కలిసి ఏం చేశారు?. వాలెంటినాతోపాటు ప్రజలందరికి వచ్చిన సెంట్రీ అనే ముప్పు ఏంటీ? సెంట్రీని ఎవరు తయారు చేశారు? దాని నుంచి యాంటీ హీరోలైన ఐదుగురు థండర్‌బోల్ట్స్‌గా ఏర్పడి ఎలా కాపాడారు? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

సూపర్ హీరో సినిమాల్లో సాధారణంగానే పెద్దగా స్టోరీ ఉండదు. కానీ, టేకింగ్, యాక్షన్ సీన్స్, అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఎలా ఉన్నాయా లేదా అనేదే హైలెట్ అవుతుంటాయి. అయితే, ఈ విషయంలో థండర్‌బోల్ట్స్ యావరేజ్‌గా సక్సెస్ అయిందనే చెప్పాలి. కానీ, మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్స్ అన్ని చూసిన ఆడియెన్స్‌కు మాత్రం ఏ విషయంలోనూ కొత్తగా అనిపించదు.

పెద్దగా ట్రైలర్స్ చూడకుండా నేరుగా చూసినవారికి మాత్రం థండర్‌బోల్ట్స్ బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. బ్లాక్ విడో గడిపే జీవితం తనకు బోర్ కొట్టడం, తాను చేసే పని నుంచి బ్రేక్ తీసుకోవాలనుకోవడం, మరోవైపు బ్లాక్ విడో తండ్రి రెడ్ గార్డియన్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ఛాన్స్ కోసం ఎదురుచూడటం ఇలా ఒక్కొకరి కథతో స్టార్ట్ అవుతుంది సినిమా.

సినిమా ప్లస్‌లు, మైనస్‌లు

ఆ తర్వాత వాలెంటీనా తనను తాను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నంతో స్టోరీలో ట్విస్ట్ ఎదురవుతుంది. అయితే, సినిమాలో మెయిన్ విలన్ ఎవరో ముందుగానే గెస్ చేసేలా ఉంది. అలాగే, క్లైమాక్స్ కూడా ఊహించేలా ఉంటుంది. విలన్ ప్రపంచానికి హానీ చేయాలనుకుంటాడు. దాని నుంచి సూపర్ హీరోలు కాపాడటం ఇదంతా గెస్ చేసేదే.

అయితే, కొన్ని చోట్ల వచ్చే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. సెంట్రీ అనే విలన్ డార్క్ సైడ్ బయటి నుంచి ప్రజలను అంతం చేయడం, ఆ డార్క్ సైడ్ లోపలికి వెళ్లి థండర్‌బోల్ట్స్ వెళ్లి మాములు మనిషిని చేసేది బాగుంది. రెగ్యులర్ యాక్షన్ ఎపిసోడ్‌తో విలన్‌ను పడగొట్టడం కాకుండా సైకలాజికల్‌గా అతన్ని మార్చే విధానం ఆకట్టుకుంటుంది.

అయితే, ఇలాంటి సీన్‌ను డీసీయూలో ఇదివరకే వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్షన్, ఎస్కేప్ సన్నివేశాల్లో సూపర్ హీరోలుగా మారిన ఈ విలన్స్ చేసే కామెడీ మెప్పిస్తుంది. ముఖ్యంగా రెడ్ గార్డియన్ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సినిమాకు అది హైలెట్ అని చెప్పొచ్చు. బీజీఎమ్ బాగుంది.

నటీనటుల పర్ఫామెన్స్ బాగుంది. ముఖ్యంగా ఫ్లొరెన్స్ ఫగ్, లెవిస్ పుల్‌మ్యాన్, డేవిడ్ హార్బర్ నటన ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా చెప్పాలంటే అక్కడక్కడ కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో మెప్పించే సరికొత్త విలన్ టీమ్ థండర్‌బోల్ట్స్.

మొత్తంగా, “థండర్‌బోల్ట్స్” చిత్రం ట్రైలర్స్ చూడని వారికి పర్వాలేదనిపిస్తుంది. యాంటీ హీరోల కాన్సెప్ట్ కొంత కొత్తగా ఉన్నా, యాక్షన్ సీన్స్, టేకింగ్ విషయంలో ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. ఓ సారి చూసే సినిమా ఇది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.