|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tik Tok Bhanu : నాకు హీరోయిన్ అవకాశాలు వచ్చినా చేయను.. డబ్బుల కోసం అవి చేయను..

Published: 29-09-2025, 5:44 PM
Tik Tok Bhanu : నాకు హీరోయిన్ అవకాశాలు వచ్చినా చేయను.. డబ్బుల కోసం అవి చేయను..

టిక్ టాక్ తో గుర్తింపు తెచ్చుకున్న భాను ఇటీవల లండన్ నుండి తిరిగి వచ్చి తన మొదటి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు వచ్చిన హీరోయిన్ అవకాశాలపై, సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. డబ్బుల కోసం సినిమాలు చేయనని స్పష్టం చేసింది.

Key Points

1

టిక్ టాక్ భాను లండన్ నుంచి తిరిగి వచ్చి తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

2

హీరోయిన్ పాత్రలు, లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ తనకు కంఫర్ట్ కాదని భాను తెలిపింది.

4

చెల్లి, అక్క, కూతురు వంటి పాత్రలు వస్తే చేస్తానని టిక్ టాక్ భాను స్పష్టం చేసింది.

టిక్ టాక్ భాను సంచలన నిర్ణయం

Tik Tok Bhanu : టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న భాను అనంతరం పలు టీవీ షోలలో కూడా పాల్గొని పాపులర్ అయింది. ఇటీవల చదువుకోడానికి లండన్ వెళ్లడంతో కొన్నాళ్ళు ఎవరికీ కనపడలేదు. తాజాగా భాను మొదటిసారి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన గురించి బోలెడన్ని విషయాలు చెప్పింది.(Tik Tok Bhanu)

ఈ క్రమంలో తనకు హీరోయిన్ అవకాశాలు వస్తే చేస్తావా? సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేస్తావా అని అడగ్గా భాను ఆసక్తికర సమాధానం చెప్పింది.

హీరోయిన్ అవకాశాలపై భాను స్పందన

డబ్బుల కోసం సినిమాలు చేయనన్న భాను

టిక్ టాక్ భాను మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా చేయను. చేయాలని లేదు కూడా. సినిమాల్లో లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ నాకు కంఫర్ట్ కాదు. అవి చేసే వాళ్ళను నేను తప్పు పట్టను, అది వాళ్ళ ఇష్టం. నాకు అయితే కంఫర్ట్ లేదు అందుకే చేయను. చెల్లి, అక్క, కూతురు.. లాంటి పాత్రలు వస్తే చేస్తాను. నేను డబ్బులు కోసం ఈ ఫీల్డ్ కి రాలేదు. దీని మీదే బతకాలని నాకు లేదు. ఛాన్సులు వస్తే అవి నాకు కంఫర్ట్ గా ఉంటేనే చేస్తాను. ఆల్రెడీ నేను కొన్ని ఛాన్సులు వస్తే నో చెప్పాను. రీల్స్ చేసేది నేను సినిమా ఛాన్సుల కోసం కాదు. నాకు నచ్చి చేసుకుంటున్నాను. డబ్బుల కోసం కూడా సినిమాలు చేయను అని తెలిపింది.

మొత్తంగా, టిక్ టాక్ భాను తన కెరీర్, సినిమాల పట్ల తన దృక్పథాన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేసింది. డబ్బుల కన్నా వ్యక్తిగత సౌలభ్యానికే ప్రాధాన్యత ఇస్తుందని ఆమె మాటలు నిరూపించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.