
📌 Key Points
- తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరమ్మతులు జరుగుతున్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచన.
- మరమ్మతుల కారణంగా తిరుమల ప్రయాణానికి గంట ముందుగా బయలుదేరాలని భక్తులకు విజ్ఞప్తి.
- ఏప్రిల్ 1న జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది.
- వసంతోత్సవాల కారణంగా పౌర్ణమి గరుడ సేవ రద్దు చేయబడింది.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్యమైన సూచనలు చేసింది. ఘాట్ రోడ్డులో మరమ్మతులు జరుగుతున్న కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణానికి గంట ముందు బయలుదేరాలని సూచించింది. అంతేకాకుండా, ఏప్రిల్ 1న జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసింది.
ఘాట్ రోడ్డు మరమ్మతులపై టీటీడీ హెచ్చరిక
తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులు వారి తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని కనీసం గంట ముందుగా ప్రారంభించాలని కోరింది.
భక్తులకు ప్రయాణ సూచనలు
మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్లు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, భక్తులు తమ తిరుమల ప్రయాణన్ని రూపొందించుకోవాలని టీటీడీ కోరింది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహనదారులు సహకరించాలని కోరింది.
రద్దయిన గరుడ సేవ – కారణం ఇదే
భక్తులకు టీటీడీ మరో అలర్ట్ కూడా ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి గరుడసేవను రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
కావున, తిరుమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులు టీటీడీ సూచనలను పరిగణలోకి తీసుకొని, తమ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలని మనవి. గరుడ సేవ రద్దు విషయాన్ని గుర్తుంచుకోండి.


