|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తిరుపతి యాత్రికులకు రైల్వే గుడ్ న్యూస్! ఇక ఈ స్టేషన్లో కూడా రైలు ఆగనుంది!

Published: 07-03-2026, 5:30 AM
తిరుపతి యాత్రికులకు రైల్వే గుడ్ న్యూస్! ఇక ఈ స్టేషన్లో కూడా రైలు ఆగనుంది!
  • తిరుపతి-అకోలా ఎక్స్‌ప్రెస్‌కు మొలకలచెరువులో అదనపు స్టాప్
  • ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి అకోలాకు రైలు
  • మొలకలచెరువులో 1 నిమిషం ఆగే రైలు
  • భక్తులకు ప్రయోజనం చేకూర్చే దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం

తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. తిరుపతి-అకోలా ఎక్స్‌ప్రెస్‌కు మొలకలచెరువులో అదనపు స్టాప్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

మొలకలచెరువులో కొత్త స్టాప్

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి – అకోలా – తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో అదనపు స్టాపేజీని కల్పించింది. ఈ రైల్వే స్టేషన్ అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించింది. ఈ నిర్ణయం మార్చి 6 తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే పేర్కొన్న వివరాల ప్రకారం….. తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయల్దేరి తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైల్ ( ట్రైన్ నెంబర్ 07605) తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది.

రైలు వేళల్లో మార్పులు

తాజా నిర్ణయం ప్రకారం…. ఈ ట్రైన్ తెల్లవారుజామున 2 గంటల 49 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. నిమిషం పాటు ఆగుతుంది. అనంతరం 2.50 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది.

ఇక అకోలా -తిరుపతి మధ్య నడిచే(ట్రైన్ నెంబ్ 07606) ట్రైన్ ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 2.34 నిమిషాలకు మొలకలచెరువు రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. నిమిషం పాటు ఆగి… మొలకలచెరువు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది.

ప్రయాణికులకు సౌకర్యం

ఈ ట్రైన్ ఏపీలోని ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ తో పాటు తెలంగాణలోని గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. అర్ధరాత్రి తర్వాత కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ఆ తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్ మీదుగా ప్రయాణించి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

తదుపరి నిర్ణయాన్ని ప్రకటించేవరకూ తిరుపతి – అకోలా ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో స్టాపింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది.

దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తిరుమల వెళ్లే భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ స్టాప్ కొనసాగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.