|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లడ్డు రాజకీయం: పవన్ కళ్యాణ్‌పై అన్వేష్ సంచలన ఆరోపణలు! ధర్మం ముసుగులో మోసాలు?

Published: 25-01-2026, 11:05 AM
లడ్డు రాజకీయం: పవన్ కళ్యాణ్‌పై అన్వేష్ సంచలన ఆరోపణలు! ధర్మం ముసుగులో మోసాలు?
  • తిరుపతి లడ్డు నాణ్యతపై గతంలో వచ్చిన ఆరోపణలను కొట్టివేసిన సిట్.
  • సనాతన ధర్మం పేరుతో మోసాలు జరుగుతున్నాయని అన్వేష్ ఆరోపణ.
  • పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు.
  • అన్వేష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.

తిరుపతి లడ్డు నాణ్యతపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, సిట్ విచారణలో కల్తీ లేదని తేలడంతో నా అన్వేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా సనాతన ధర్మం పేరుతో కొందరు మోసాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

లడ్డు వివాదంపై స్పందించిన అన్వేష్

Naa Anveshana: గత ఏడాది కాలంగా కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పై ఎన్నో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నూనె ఉపయోగించారు అంటూ ప్రభుత్వాలు చెప్పడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీంతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో గత ప్రభుత్వంపై కాస్త విమర్శలు కురిపించారు. ఇక ఈ విషయంపై సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ గతంలో తిరుపతి లడ్డు(Tirupathi Laddu) కల్తీ వివాదంపై విమర్శలు కురిపించారు.

ఇక లడ్డు కల్తీపై సిట్ విచారణకు ఆదేశాలు రాగా ఈ విచారణ అనంతరం తిరుపతి లడ్డులో కల్తీ జరగలేదని వెల్లడించారు. దీంతో పలువురు ఈ ఘటనపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ (Naa Anvesh)సైతం ఈ వ్యవహారం పై స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో ఈయన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరును వాడకుండా పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ వివాదం పై అన్వేష్ ఒక వీడియోని షేర్ చేస్తూ తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అంటూ అప్పట్లో వార్తలు రావడంతో ఎంతో మంది హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి.

సనాతన ధర్మం పేరుతో మోసాలు?

తాజాగా సుప్రీంకోర్టు సిట్ విచారణ అనంతరం ఇందులో కల్తీ జరగలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చారని అన్వేష్ తెలిపారు. అయితే తాను గతంలో ఇదే విషయం గురించి మాట్లాడానని ఈయన గుర్తు చేశారు. కొంతమంది సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తున్నారు మీకు గుర్తుందా అంటూ ఈయన పరోక్షంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు. సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారంటూ పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు. మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. సనాతన ధర్మం పేరుతో, జైశ్రీరామ్ అనే పేరుతో, కాషాయ దుస్తులు ధరించి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారని, వీధికి వందమంది బాబాలు ఉన్నారని ఇలాంటి వాటిని అరికట్టాలి అంటూ అన్వేష్ ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది.

?igsh=MTlyOXFydnc5eXYxMw%3D%3D

పవన్ కళ్యాణ్‌పై పరోక్ష విమర్శలు

ఇక ఈ వీడియో పై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నా అన్వేష్ కు మద్దతు తెలియజేయగా మరికొందరు ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక గత కొద్దిరోజులుగా నా అన్వేష్ ఇలాంటి వివాదాస్పద విషయాలపై స్పందిస్తూ వీడియోలు చేస్తున్న నేపథ్యంలో ఈయన కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ హిందూ దేవుళ్ళ అంశాలను ప్రస్తావించడంతో ఈయనపై విమర్శలు రావడమే కాకుండా లక్షల సంఖ్యలో ఈయనని అన్ ఫాలో చేశారు. ఇప్పుడు మరోసారి తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడటంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.

అన్వేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.