
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శివానీ నగరం ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో, సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయనతో నటించేందుకు ఏదైనా చేస్తానని చెప్పడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Key Points
శివానీ నగరం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇటీవల 'లిటిల్ హార్ట్స్' సినిమాతో పెద్ద విజయాన్ని సాధించి క్రేజ్ పెంచుకుంది.
మహేష్ బాబు తనకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ హీరో అని శివానీ వెల్లడించింది.
ఆయనతో నటించే అవకాశం వస్తే ఎంత కష్టం అయినా భరిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
శివానీ నగరం సినీ ప్రస్థానం
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శివానీ నగరం(Shivani Nagaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ (Ambajipeta Marriage Band)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల ఆమె ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా కలెక్షన్లు కూడా బాగానే రాబట్టడంతో పాటు.. సినీ సెలబ్రిటీలు ప్రశంసలు పొందింది. ‘లిటిల్ హార్ట్స్’ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని ఇచ్చింది.
దీంతో శివానీ నగరం క్రేజ్ ఊహించని రేంజ్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలలో పాల్గొన్న శివానీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు మహేష్ బాబు అంటే పిచ్చి ఇష్టం. ఆయనను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా అందంగా ఉంటారు. సూపర్ స్టార్ నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ హీరో. ఒక్కసారి అయినా ఆయనను కలవాలని అనుకునేదాన్ని. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక అవకాశం వస్తే ఆయన మూవీలో ఎలాంటి పాత్ర అయినా చేయాలనుకుంటున్నాను. మహేష్ బాబుతో నటించేందుకు ఎదురుచూస్తున్నాను. ఒకవేళ అవకాశం వస్తే ఎంత బిజీగా ఉన్నా సరే ఒప్పుకుంటాను. ఆయన కోసం ఏదైనా చేస్తా.. ఎంత కష్టం అయినా మహేష్ బాబు కోసం తట్టుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది.
మహేష్ బాబు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం
ఆయన కోసం ఏదైనా చేస్తా: శివానీ
శివానీ నగరం చేసిన ఈ వ్యాఖ్యలు మహేష్ బాబు అభిమానులను కూడా ఆకట్టుకుంటున్నాయి. తన ఆరాధ్య హీరోతో నటించే అవకాశం ఆమెకు త్వరలోనే రావాలని పలువురు ఆశిస్తున్నారు. ఇది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


