|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ షాక్: హీరోగా లాంచ్ చేస్తానంటూ రూ.3.5 కోట్లు వసూలు.. దర్శకుడిపై కేసు!

Published: 10-07-2026, 7:00 AM
టాలీవుడ్ షాక్: హీరోగా లాంచ్ చేస్తానంటూ రూ.3.5 కోట్లు వసూలు.. దర్శకుడిపై కేసు!
  • హనుమంతరావు తన కొడుకును హీరోగా లాంచ్ చేస్తామని దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మి రూ.3.5 కోట్లు వసూలు చేశారు.
  • సినిమా ప్రారంభం కాకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.
  • పోలీసులు ఆర్థిక నేరాల విభాగానికి కేసును బదిలీ చేసి దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదు చేశారు.
  • అశోక్ బాబు ‘భాగమతి’, ‘పిల్ల జమిందార్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

టాలీవుడ్‌లో తాజాగా సంచలనం రేపిన మోసం కేసులో ప్రముఖ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మిపై సైబరాబాద్‌లో కేసు నమోదైంది. హీరోగా లాంచ్ చేస్తామని నమ్మించి ఓ యువకుడి నుంచి రూ.3.5 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.

హీరోగా లాంచ్ చేస్తానంటూ రూ.3.5 కోట్ల వసూలు

Ashok Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ ,సక్సెస్ ఎంత కామనో అంతకుమించిన అగ్రిమెంట్లు, కాంట్రవర్సీలు,మోసాలు అంతే కామన్.తాజాగా అలాంటి ఓ మోసం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది .సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న ఓ ప్రముఖ దర్శకుడు,నిర్మాత కలిసి ఒక యువకుడిని హీరోగా లాంచ్ చేస్తామంటూ ఏకంగా 3.5 కోట్లు వసూలు చేసి ఆ తర్వాత చేతులెత్తేసారన్న సంఘటన మీడియాలో తెగ హైలైట్ అవుతుంది.

తన వద్ద ఏకంగా 3.5 కోట్లు వసూలు చేశాడంటూ

విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, తన కొడుకుని హీరోగా చేస్తానంటూ నమ్మించి తన వద్ద ఏకంగా 3.5 కోట్లు వసూలు చేశాడంటూ ఆరోపణలు చేశాడు హనుమంతరావు.ఇక ఈ మోసంలో ప్రొడ్యూసర్ విజయలక్ష్మి పాత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.సినిమాని  త్వరలోనే మొదలెడతామని, భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా  లాంచ్ చేస్తామని నమ్మిస్తూ ఇప్పుడు సినిమాని తెరకెక్కించకుండా లేట్ చేస్తున్నాడంటూ ఆరోపించాడు హనుమంతరావు.ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడం, ఇచ్చిన డబ్బు గురించి గట్టిగా అడిగితే ఇవ్వకుండా తప్పించుకోవడం వంటి కారణాలతో సైబరాబాద్ పోలీస్ లని ఆశ్రయించాడు హనుమంతరావు .

దర్శకుడు అశోక్ బాబు, నిర్మాతపై కేసు నమోదు

దాంతో ఇచ్చిన కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఆర్థిక నేరాల విభాగానికి కేసును బదిలీ చేసినట్టు తెలుస్తుంది.రంగంలోకి దిగిన EOW అధికారులు దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారని సమాచారం.నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్స్ అన్నింటిని పోలీసులు క్షుణంగా పరిశీలిస్తున్నారట.ఇప్పటికే నిందితులకు నోటీసు జారీచేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

పిల్ల జమిందార్  సినిమాకి ఈయనే దర్శకుడు

ఇక ఈసినిమా ఇంతలా వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం అశోక్ బాబుకు ఉన్న ట్రాక్ రికార్డు .మరీ టాప్ హీరోస్ తో బ్లాక్ బాస్టర్లు ఏమీ కాదు కానీ  నాని కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిన పిల్ల జమిందార్  సినిమాకి ఈయనే దర్శకుడు.అలాగే అంతకుముందు అల్లరి నరేష్ తో ఆకాశరామన్న తీసింది కూడా ఈయనే.ఇక 2018లో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన భాగమతి సినిమా ఈయనకి మంచి ఇమేజ్  తెచ్చి పెట్టింది .ఇక ఈ సినిమా కోలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్ళని సాధించడం విశేషం.

సైబరాబాద్ పోలీసుల విచారణ, EOWకు బదిలీ

ఈ ఆరోపణలపై ఎలా రియాక్ట్ అవుతాడో !

అలా పలు మంచి సినిమాలు తీసిన అశోక్ బాబు ఇలా ఫైనాన్షియల్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం గమనార్హం.సినీ ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారిని, వారి తల్లిదండ్రులను టార్గెట్ చేస్తూ కొంతమంది బ్రోకర్స్ మోసం చేయడం మనం చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ ఏకంగా భాగమతి లాంటి వంద కోట్ల సినిమా తీసిన దర్శకుడే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం కాస్త ఆసక్తికరం. చూడాలి మరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న ఈ దర్శకుడు ఈ ఆరోపణలపై ఎలా రియాక్ట్ అవుతాడో !

ఈ కేసు టాలీవుడ్‌లో మరోసారి నమ్మకం, ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. పోలీసుల విచారణలో నిజాలు బయటపడతాయని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.