
ధనుష్ నటించిన ‘కుబేర’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాలోని ధనుష్ పాత్రను మొదట విజయ్ దేవరకొండకు అందించారని, అతను తిరస్కరించాడని వార్తలు వస్తున్నాయి.
Key Points
‘కుబేర’ సినిమా ఘన విజయం సాధించింది.
విజయ్ దేవరకొండ ‘కుబేర’లో ధనుష్ పాత్రను తిరస్కరించాడు.
బిచ్చగాడి పాత్ర చేయడం తనకు సరిపోదని విజయ్ అభిప్రాయం.
బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకున్నాడని నెటిజన్ల అభిప్రాయం.
కుబేర సినిమా విజయం
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), శేఖర్ కమ్ముల(Shekhar Kammula) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’(Kubera). ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. అక్కినేని నాగార్జున(Nagarjuna) కీలక పాత్రలో కనిపించాడు.అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు.ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో జూన్ 20న థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. శేఖర్ కమ్ముల చేసి ఈ కొత్త ప్రయత్నం ఘన విజయం సాధించడంతో అంతా ఆయనకు శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ నిర్ణయం
ఈ సినిమాను డైరెక్టర్ బాగా తీశారని మెచ్చుకుంటున్నారు. అయితే ధనవంతుడిని బిచ్చగాడికి మధ్య జరిగే స్టోరీనే ‘కుబేర’. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి అవతారమెత్తిన విషయం తెలిసిందే. తిరుపతి వీధుల్లో అమ్మా అమ్మా అంటూ బిచ్చం ఎత్తుకుని ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇంత హిట్ సినిమాను మిస్ చేసుకుంది ఓ టాలీవుడ్ యంగ్ హీరో అని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నెటిజన్ల అభిప్రాయాలు
ధనుష్ పాత్రను మొదట టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకున్నారట. శేఖర్ కమ్ములతో ఉన్న అనుబంధంతో ఈ పాత్రలో ఆయనకు చాన్స్ ఇచ్చాడని సమాచారం. కానీ బిచ్చగాడి పాత్రలో నటించడం నా వల్ల కాదు నేను చేయనంటూ రిజెక్ట్ చేశాడని టాక్. అలాంటి పాత్రలు తనకు సెట్ కావని తిరస్కరించాడట. ఇక ఈ విషయంపై నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్నాడని అంటున్నారు.
విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లలో చర్చ జరుగుతోంది. బంపర్ ఆఫర్‌ను వదులుకోవడం సరైనదేనా అనేది ప్రశ్నార్థకం.


