|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: టాలీవుడ్‌లో టైటిల్స్ గల్లంతు! చివరి నిమిషంలో మార్పులు.. కారణమేంటి?

Published: 17-02-2026, 5:05 AM
షాకింగ్: టాలీవుడ్‌లో టైటిల్స్ గల్లంతు! చివరి నిమిషంలో మార్పులు.. కారణమేంటి?
  • వనవీర సినిమా టైటిల్ ‘వానర’ నుండి ‘వనవీర’గా మార్పు!
  • శ్రీ చితంబరం సినిమా పేరు కాస్తా ‘శ్రీ చితంబరం గారు’గా మారింది.
  • చాయ్ వాలా కాస్తా నవాబ్ కేఫ్ అయింది.
  • సుహాస్ ‘హే భగవాన్’ ఇప్పుడు ‘హే బలవంత్’గా రాబోతున్నాడు!

టాలీవుడ్‌లో సంచలనం! సినిమాల టైటిల్స్ మాయమవుతున్నాయా? రిలీజ్‌కు ముందు టైటిల్స్ మార్చే ట్రెండ్ వెనుక అసలు కారణాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వార్త చదవండి!

టైటిల్ మార్పు ట్రెండ్ ఎందుకు?

Tollywood: సినిమా ఎంత బాగుందా అది జనాల్లోకి వెళ్లాలంటే టైటిల్(సినిమా పేరు) అనేది చాలా ఇంపార్టెంట్. టైటిల్ ఎంత క్యాచీగా, పవర్ ఫుల్ గా ఉండే జనాలు అంతగా ఆ సినిమాకు అట్రాక్ట్ అవుతారు. అందుకే, టైటిల్ విషయంలో మేకర్స్ అస్సలు కాంప్రమైజ్ కారు. ఒకవేళ తమకు అవసరమైన టైటిల్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే డబ్బులు పే చేసి మరీ టైటిల్ కొనుకుంటారు. అంత ప్రెత్యేకం సినిమా టైటిల్ అంటే.

అయితే, ఈ మధ్య కాలంలో అలా ఉండటం లేదు. ముందుగా అనుకున్న టైటిల్స్ సినిమా రిలీజ్ సమయాణానికి మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ తంతు బాగా పెరిగిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవల టాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలకు లాస్ట్ మినిట్ (Tollywood)లో టైటిల్ చేంజ్ అవుతున్నాయి. అలా చేంజ్ అయినా సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.’

చివరి నిమిషంలో మారిన టైటిల్స్!

వాటిలో ముందుగా వచ్చింది వనవీర. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ వానర. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ సినిమాను వనవీరకు మార్చారు. ఆ తరువాత వచ్చిన సినిమా శ్రీ చితంబరం గారు. అంతా కొత్తవాళ్లు కలిసి చేసిన ఈ సినిమాలకు ముందుగా అనుకున్న టైటిల్ శ్రీ చితంబరం కానీ, అనుకోని కారణాల వల్ల సినిమా టైటిల్ ను శ్రీ చితంబరం గారుగ మార్చారు. ఇక ఈ రెండు సినిమాల తరువాత వస్తున్న నవాబ్ కేఫ్.

టైటిల్ మార్పులు సినిమాకు నెగటివా?

చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా చాయ్ వాలా అనే టైటిల్ అనుకున్నారు కానీ, ఈమధ్య నవాబ్ కేఫ్ గా మార్చేశారు. ఇక త్వరలో విడుదల కాబోతున్న సుహాస్ హే భగవాన్ సినిమాకు కూడా అదే జరిగింది.ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ గా ఉండాలని హే భగవాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ, ఆ టైటిల్ ఇప్పుడు హే బలవంత్ గా మారింది. ఇలా ఈమధ్య కాలంలో విడువులైన చాలా సినిమాలకు టైటిల్ చేంజ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ కూడా అధికారికంగా పక్రార్తించారు. మరి ఈ టైటిల్చేంజ్ అవడం అనేది ఒకరకంగా సినిమాకు నెగిటీవ్ పాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

సినిమా టైటిల్స్ మార్పు అనేది సినిమా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.