
📌 Key Points
- ఉగాది వరకు థియేటర్లు ఖాళీగా ఉండనున్నాయి, పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు.
- మార్చి మొదటి వారంలో విడుదలైన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
- ఉగాదికి పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం విడుదల కానుంది.
- ప్రతి వారం చాలా సినిమాలు విడుదలవుతున్నప్పటికీ, ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి పండగకి సినిమాల సందడి ఉంటుంది. అయితే ఈసారి ఉగాది వరకు థియేటర్లు ఖాళీగా ఉండనున్నాయి. మార్చిలో విడుదలైన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఉగాదికి విడుదలయ్యే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఉగాది వరకు థియేటర్లు ఖాళీ కావడానికి కారణం?
Tollywood Movies : ప్రతి పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఇక్కడ సినిమాల సంగతి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఈ పండగకి పోటీ పడతాయి. ఆ తర్వాత వాలెంటెన్స్ డే సందర్భంగా సినిమాలు కొన్ని రిలీజ్ అవుతాయి. ఇక సమ్మర్ అంటే కచ్చితంగా ఉగాదికి బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంటాయి.. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి రెండవ వారం పెద్దగా సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న వార్ గురించి అందరికీ తెలుసు.. దాని కారణంగా గతవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.. ఈవారం థియేటర్లలో సినిమాలు పెద్దగా రిలీజ్ అవడం లేదని తెలుస్తుంది.. ఉగాది పండగ వరకు థియేటర్లు ఖాళీగానే ఉండబోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఉగాదికి ఎలాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
ప్రతి శుక్రవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కానీ మార్చ్ లో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా పసలేకుండానే నిరాశను మిగిల్చాయి.. మార్చి తొలివారంలో ‘మృత్యుంజయ్’తో పాటు మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. కానీ, ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ టాక్ని అందుకు లేకపోయాయి. దాంతో ఈ వారం రిలీజ్ అయిన సినిమాలకు జనాలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు.. మార్చ్ మూడోవారము నాలుగో వారం సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు ఉగాదికి రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..
మార్చిలో విడుదలైన సినిమాల పరిస్థితి ఏమిటి?
ఉగాదికి విడుదల కాబోయే భారీ సినిమాలు ఏవి?
ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. కానీ ఈ శుక్రవారం మాత్రం చెప్పుకోదగ్గ సినిమాలైతే రిలీజ్ కావడం లేదని తెలుస్తుంది. ఇక ఉగాదికి మాత్రం థియేటర్లు ఫుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఉగాదికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది.. ఉగాది పర్వదినం కానుకగా మార్చి 19న రెండు బడా సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సీక్వెల్ మూవీ దురంధర్ 2 రిలీజ్ కాబోతుంది. నిజానికి ఈ సినిమా గత వారంలోని రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడింది. ఈ రెండు సినిమాలు ఈ ఉగాదికి పోటీ పడిపోతున్నాయి. ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి…
ఉగాది పండుగకు థియేటర్లు కళకళలాడనున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి ఉంటుందో చూడాలి.

