
📌 Key Points
- ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాప్ స్క్రిప్ట్ లను ఎంచుకోవడం వల్ల వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి.
- పాత స్క్రిప్టులను ఎంపిక చేసుకొని, వాటితో సినిమాలు తీస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
- బడ్జెట్ సమస్యల వల్ల మంచి స్క్రిప్టులు వేరే నిర్మాణ సంస్థలకు వెళ్లి అక్కడ విజయాలు సాధించాయి.
- కొందరు సూపర్ హిట్ డైరెక్టర్లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నా, ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నిర్మాణ సంస్థ పదే పదే ప్లాప్ స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం వల్ల వరుసగా నష్టాలను చవిచూస్తోంది. మంచి కథలు చేతికి అందినా, వివిధ కారణాల వల్ల వాటిని కోల్పోతున్నారు. దీని ఫలితంగా ఆ సంస్థ విజయాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
నిర్మాణ సంస్థలో వరుస ఫ్లాప్ లు
Tollywood Industry: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమా చేయడం కోసం నిర్మాతలు ఎంత కష్టపడతారో చెప్పాల్సిన పనిలేదు. ఒకటికి రెండుసార్లు వారు చేస్తున్న స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని సినిమాలు చేస్తారు. ఇలా ఒక సినిమా తెరపైకి వస్తుందంటే తెర వెనక దర్శక నిర్మాతలు పడే కష్టం మామూలుగా ఉండదు. ఇలా ప్రతి ఒక్క దర్శక నిర్మాత కూడా సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నిర్మాత మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి స్టార్ హీరోలు దర్శకులు సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు కావటం గమనార్ధం.
ఈ ప్రొడక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలన్నీ కూడా పాత స్క్రిప్స్ అని తెలుస్తుంది ఇలా ఫ్లాప్ అయిన పాత స్క్రిప్టులను ఎంపిక చేసుకొని ఓకే హీరో లేదా ఓకే దర్శకుడితో సినిమాలు చేస్తూ మళ్ళీ ఫ్లాపులను మూట కట్టుకుంటున్నారు. ఈ బ్యానర్ ద్వారా భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న సక్సెస్ రేట్ విషయంలో మాత్రం విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ బ్యానర్ లో తెలుగు హీరోలు తమిళ దర్శకుల కాంబినేషన్లోనూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే ఇవి పూర్తిగా నిరాశపరిచాయి. ఈ బ్యానర్ ద్వారా కొన్ని అద్భుతమైన స్క్రిప్ట్ లను కూడా ఎంపిక చేసుకున్నప్పటికీ బడ్జెట్ ఇష్యూ లేదా ఇతర కారణాలవల్ల ఆ అద్భుతమైన స్క్రిప్టులు వేరే బ్యానర్ చేతికి వెళ్లిపోతున్నాయి. ఇలా వేరే బ్యానర్ లోకి వెళ్లిన ఆ స్క్రిప్ట్ లు మంచి సక్సెస్ అందుకున్నాయి.
పాత స్క్రిప్టులనే నమ్ముకుంటున్న నిర్మాతలు
ఇండస్ట్రీలో సక్సెస్ సినిమాలను అందుకోవాలి అంటే రాసిపెట్టి ఉండాలని చెబుతూ ఉంటారు. అలా రాసి పెట్టి ఉండాలి అనే మాట ఇండస్ట్రీలో సక్సెస్ రేటును బట్టి మారుతుంది. అయితే ఈ నిర్మాణ సంస్థలో ప్రస్తుతం మరికొన్ని బడా సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కొన్ని సినిమాలను సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్లతోనూ, మాస్ డైరెక్టర్లతోనూ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు మరి ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ ను ఇస్తాయో తెలియాల్సి ఉంది.
సక్సెస్ కోసం ఎదురుచూపులు
మొత్తానికి, ఈ నిర్మాణ సంస్థ భవిష్యత్తులోనైనా మంచి విజయాలు సాధిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం ప్లాప్ స్క్రిప్టుల ఎంపికతో విమర్శలు ఎదుర్కొంటోంది.


