
నేడు తెలుగు సినిమా నిర్మాతలు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిశారు. ఫిలిం ఫెడరేషన్ సమ్మె నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చ జరిగింది.
Key Points
సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతల సమావేశం జరిగింది.
ఫిలిం ఫెడరేషన్ సమ్మెపై చర్చ జరగలేదు.
చిన్న బడ్జెట్ సినిమాలకు మద్దతు అందించాలని నిర్మాతల కోరిక.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో భేటీకి నిర్మాతలు విజ్ఞప్తి చేశారు.
నిర్మాతలతో మంత్రి భేటీ
Kandula Durgesh : ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో నేడు తెలుగు సినిమా నిర్మాతలు భేటీ అయ్యారు. బివిఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, కెఎల్ నారాయణ, భరత్(ఛాంబర్ ప్రెసిడెంట్), నాగవంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వప్రసాద్, బన్నీవాసు, స్వప్నదత్, యూవీ వంశీ, చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి.. మరికొంతమంది నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరిగింది. గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు, ఫిలిం ఫెడరేషన్ సమ్మె నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమ్మెపై చర్చ లేదు
చిన్న సినిమాలకు మద్దతు
మంత్రి దుర్గేష్ తో మీటింగ్ అయిన అనంతరం నిర్మాతలు రవి శంకర్, నాగవంశీ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల గురించి మంత్రి కందుల రమేష్ తో జరిగిన సమవేశంలో చర్చకు రాలేదు. అది ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ చూసుకుంటుంది. చిన్న బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు ఇవ్వాలనేది అందరి మాటే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరాము. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి చర్చ జరిగింది. త్వరలో సీఎం, డిప్యూటీ సీఎంతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.
చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రోత్సాహం అవసరమని నిర్మాతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో త్వరలో భేటీ అవుతామని మంత్రి హామీ ఇచ్చారు.


