
📌 Key Points
- టాలీవుడ్‌లో విడుదల తేదీలను వాయిదా వేయడం ఒక సాధారణ ధోరణిగా మారింది.
- విడుదల తేదీలు వాయిదా పడటంతో భారీ ప్రాజెక్టుల బాక్సాఫీస్ ప్లానింగ్ దెబ్బతింటోంది.
- రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న ‘పెద్ది’ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
- విడుదల కోసం ఎదురుచూస్తున్న సినిమాలు డేట్స్ కోసం క్యూలో నిలబడుతున్నాయి.
టాలీవుడ్‌లో ఇప్పుడు విడుదల తేదీలను వాయిదా వేయడం ఒక ట్రెండ్‌గా మారింది. చాలా సినిమాలు విడుదల తేదీలను ప్రకటించిన తర్వాత కూడా వాయిదా పడుతున్నాయి. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద ప్రణాళికలు అస్థవ్యస్తంగా మారుతున్నాయి.
టాలీవుడ్‌లో వాయిదాల ట్రెండ్
Release Delays: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వింతైన ట్రెండ్ నడుస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, ఆఖరి నిమిషంలో ‘సారీ బాస్.. పోస్ట్‌పోన్’ అనడం మేకర్స్‌కు ఒక ఫ్యాషన్ అయిపోయింది.దీంతో అసలు మన ఇండస్ట్రీకి ‘డెడ్‌లైన్’ అనే మాటకు గౌరవం ఉందా? లేక ఆ డేట్ కేవలం ఒక ‘సజెషన్’ మాత్రమేనా? అన్న డౌట్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్.ఇక భారీ అంచనాల మధ్య అనౌన్స్ అయిన బిగ్ ప్రాజెక్ట్స్ అన్నీ వరుసగా వాయిదా పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ప్లానింగ్ మొత్తం ‘క్రాష్’ అయిపోతోంది.
వాయిదాల లిస్టులో వరుసకట్టిన ‘బిగ్ గన్స్’ అసలు ఈ వాయిదాల పర్వం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ చాలు. టాలీవుడ్‌ను షేక్ చేయాల్సిన సినిమాలు ఇప్పుడు క్యూలో నిలబడి ‘డేట్ల’ కోసం వెతుక్కుంటున్నాయి.
ప్యారడైజ్ (Paradise).. నాని సినిమా అంటేనే హైప్. కానీ షూటింగ్ డిలేస్ వల్ల ఈ సినిమా కూడా 21 August 2026 వస్తామంటూ ‘పోస్ట్‌పోన్’ పాట పాడేసింది.
వరుస వాయిదాలతో నష్టాలు
టాక్సిక్ (Toxic).. ఇక టాలీవుడ్ తో పాటు దేశం మొత్తం ఎదురుచూస్తున్న యశ్ క్రేజీ ప్రాజెక్ట్ టాక్సిక్ పరిస్థితి కూడా అంతే.అనౌన్స్ మెంట్ లో ఉన్న జోరు రిలీజ్ లో చూపించట్లేదు మేకర్స్. అలా ఎప్పటికప్పుడు డేట్లు మారుస్తూ చివరికి 4 June 2026 అని ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెట్టేసింది మూవీ టీమ్ .
విశ్వంభర(vishvambhara).. మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ. గ్రాఫిక్స్ పనుల సాకుతో గత సంక్రాంతి నుంచి తప్పుకున్న ఈ సినిమా, మళ్ళీ మళ్ళీ డేట్లు మార్చుకుంటూ పోతోంది తప్ప ఎప్పుడు వస్తుందన్న క్లారిటీ వశిష్ట కూడా ఇవ్వలేకపోతున్నాడు.ఇక సంచలనం స్ప్రుష్టించిన పుష్ప 2, భారీ వసూళ్లు కొల్లగొట్టిన దేవర, వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిన హరిహర వీరమల్లు , వచ్చి పీడకలని మిగిల్చిన గేమ్ చేంజర్ ..ఇలా తవ్వుకుంటూ పొతే వాయిదాల పాట పాడినవి ఇక్కడ కోకొల్లల్లు .
‘పెద్ది’ చుట్టూ పుకార్ల షికారు! ఇప్పుడు ఇదే ‘పోస్ట్‌పోన్’ గండం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న ‘పెద్ది’ కి కూడా తగిలిందని టాక్ వినిపిస్తోంది.యస్ ..ముందుగా మార్చి 27న రావాల్సిన ‘పెద్ది’, ఏప్రిల్ 30కి షిఫ్ట్ అయిందని తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. ఏప్రిల్ 30 కూడా కష్టమేనని, సినిమా మే లేదా జూన్‌కు వెళ్లే ఛాన్స్ ఉందని. దీంతో మెగా ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం ఏళ్ళ తరబడి వేచి చూసిన ఫ్యాన్స్‌కు, ఇప్పుడు ‘పెద్ది’ కూడా అదే ‘వెయిటింగ్’ ట్రీట్ ఇస్తుందేమోనని టెన్షన్ మొదలైంది.
‘పెద్ది’ సినిమాకు పోస్ట్ పోన్ గండం?
ఇన్ సైడ్ టాక్ ..‘మేము తగ్గడం లేదు’! అయితే, బయట వినిపిస్తున్న పుకార్లకు భిన్నంగా ‘పెద్ది’ టీమ్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30 మిస్ కాకూడదని బుచ్చిబాబు టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోంది.ఒక స్పెషల్ సాంగ్ తప్ప షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ కంప్లీట్ చేశారు. రంజాన్ తర్వాత సెకండాఫ్ పై జెట్ స్పీడ్ లో వర్క్ చేయనున్నారు.మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వంటి దిగ్గజాలు వెనుక ఉండటంతో ప్లానింగ్‌లో లోటు లేదన్నది ఇన్ సైడ్ టాక్.
టాలీవుడ్ క్రెడిబిలిటీకి గండం! అయితే పదే పదే డేట్లు మార్చడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో నష్టం రావడమే కాకుండా, ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ‘ఇంట్రెస్ట్’ చచ్చిపోతుంది. ఒకప్పుడు రిలీజ్ డేట్ అంటే పక్కాగా ఉండేది . ఇప్పుడు మాత్రం అది ఒక ‘గేమ్’ లా మారిపోయింది. ఈ వాయిదాల రోగానికి ‘పెద్ది’ ఒక బలమైన సమాధానం చెప్పాలి.నిజంగా అనౌన్స్ చేసిన డేట్‌కే వస్తే.. అది కేవలం సక్సెస్ మాత్రమే కాదు, మన ఇండస్ట్రీ ప్లానింగ్‌పై ఉన్న నెగిటివిటీకి ఒక చెక్ పెట్టినట్టే! మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, మూడో సాంగ్ అప్‌డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ‘పెద్ది’ ఈ పుకార్లను బ్రేక్ చేసి ఏప్రిల్ 30న బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తాడో లేదో చూడాలి!
టాలీవుడ్‌లో సినిమాల విడుదల తేదీల విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. నిర్మాతలు త్వరితగతిన ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. లేకపోతె నిరీక్షణ మరింత భారమవుతుంది.


