
📌 Key Points
- చిరంజీవి మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’కు రూ. 1000కి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
- పవన్ కళ్యాణ్ ‘ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి’ సినిమాకు నెలకు రూ. 5000 జీతం అందుకున్నారు.
- మహేష్ బాబు బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, ‘రాజకుమారుడు’తో హీరోగా మారారు.
- మహేష్ బాబు మొదటి సినిమా ‘రాజకుమారుడు’కు రూ. 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు కోట్లు సంపాదిస్తున్నా, వారి సినీ రంగ ప్రవేశ సమయంలో మొదటి రెమ్యూనరేషన్ ఎంత అనేది ఆసక్తికర విషయం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి ప్రముఖులు తమ తొలి సినిమాకు ఎంత తీసుకున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి మొదటి రెమ్యూనరేషన్
Tollywood Heros : టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు.. అందులో కొందరు హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరికొందరు మాత్రం చేసిన సినిమాలన్నీ కూడా హిట్ కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అయితే చాలామందికి హీరోలో సినిమా ఎంట్రీ ఎలా జరిగిందనేది తెలుసు.. కానీ వాళ్ల మొదటి రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలని నెటిజెన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరి టాలీవుడ్ స్టార్ హీరోల మొదటి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఫీల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవి అంటే టాలీవుడ్ లోనే కుర్ర హీరోలకు రోల్ మోడల్. చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు.. 1978లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ 1000కి పైగానే ఉంటుంది.. ప్రస్తుతం ఈయన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈ సినిమా ఈనెల 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది.
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 1996లో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇవి సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ మూవీకి గాను పవన్ కళ్యాణ్ కు నెలకు 5000 రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈయన ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే.. మరోవైపు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సంపాదన
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు బాల నటుడిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చాడు. ఆయన నటించిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చేయడాది థియేటర్లలోకి రాబోతుంది. ఈయన మొదటి సినిమాకు తీసుకున్న 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2002లో జయంత్ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ మూవీ తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత పలు చిత్రాల్లో నటించాడు కానీ స్టార్ ఇమేజ్ ని అందుకోలేదు. అయితే ఆ సినిమాకి ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ రాజా సాబ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు..
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో అడుగుపెట్టాడు. తనదైన స్టైల్ లో నటించి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు … అయితే ఈ సినిమాకు వచ్చిన డబ్బులు అన్నిటిని కూడా అతను తీసుకోకుండా చారిటీకి ఇచ్చేసాడు. ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఆరంగేట్రం జీతం
నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇతను కూడా బాలా నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాకు ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్ 4 లక్షలు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈయన ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు..
వీళ్లే కాదు నేచురల్ స్టార్ నాని మొదటి రెమ్యూనరేషన్ 4 వేలు, అలాగే విజయ్ దేవరకొండ 500, అల్లు అర్జున్ జీరో.. రెమ్యూనరేషన్ లను అందుకున్నారు..
ఈ కథనంలో టాలీవుడ్ స్టార్ హీరోల తొలి రెమ్యూనరేషన్ వివరాలు తెలుసుకున్నాం. నేడు కోట్లు ఆర్జిస్తున్న ఈ నటులు, అతి తక్కువ జీతంతో తమ సినీ ప్రస్థానం ప్రారంభించడం వారి కృషికి, నిబద్ధతకు నిదర్శనం.


