
టాలీవుడ్ నటులు అమెరికాలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచారు. వెంకటేష్, తమన్, ఆది, అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి స్టార్స్ ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. వారి విజయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
అమెరికాలో టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ టోర్నమెంట్ గెలుపు
వెంకటేష్, తమన్, ఆది, అశ్విన్, ప్రశాంత్ వర్మలతో కలిసి ఫోటో
ఆది బెస్ట్ బౌలర్ గా అవార్డు గెలుపు
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారడం
అమెరికా క్రికెట్ టోర్నమెంట్ విజయం
Tollywood : మన టాలీవుడ్ లో క్రికెట్ బాగా ఆడవాళ్లు చాలా మంది ఉన్నారని తెలిసిందే. అఖిల్, తమన్, తరుణ్, ఆది, అశ్విన్, ప్రశాంత్ వర్మ.. ఇలా చాలా మంది క్రికెట్ బాగా ఆడతారు. వీళ్లంతా ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక మ్యాచ్ లు ఆడతారు. ఇక సెలెబ్రిటీ క్రికెట్ లో రెచ్చిపోయి మరీ ఆడతారు. తాజాగా ఈ టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి అమెరికాలో క్రికెట్ ఆడి కప్ గెలిచారు.
అమెరికాలో నాట్స్( నార్త్ అమెరికా తెలుగు సంఘం) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మన టాలీవుడ్ స్టార్స్ అక్కడి తెలుగువారితో ఆడి గెలిచారు. ఇటీవల ఈ నాట్స్ వేడుకలకు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయిన సంగతి తెలిసిందే. తమన్ కెప్టెన్సీ లో, వెంకటేష్ పర్యవేకషణలో టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడి గెలిచారు. గెలిచిన కప్ తో ఫొటోలు దిగారు.
వెంకటేష్ సమక్షంలో విజేతల ఫోటో
హీరో ఆది తాము గెలిచిన కప్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటోలో వెంకటేష్, తమన్, ఆది, అశ్విన్, ప్రశాంత్ వర్మ ఉన్నారు. వీరంతా వెంకటేష్ నుంచి కప్ తీసుకున్నట్టు ఫోటో దిగారు. ఇక ఈ మ్యాచ్ లో ఆది బెస్ట్ బౌలర్ గా కూడా మెమెంటో గెలిచాడు. దీంతో ఆది షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఆది యొక్క అద్భుత ప్రదర్శన
టాలీవుడ్ నటుల క్రికెట్ ప్రేమకు ఇది మరో నిదర్శనం. వారి విజయం అభిమానులను ఉత్సాహపరిచింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం సంతోషాన్నిచ్చింది.


