
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను జూన్ 1 నుండి బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు ప్రకటించారు. అద్దె విధానం వల్ల నష్టాలను ఎదుర్కుంటున్నామని వారు వాదిస్తున్నారు. పర్సంటేజీ విధానంపై నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి.
Key Points
జూన్ 1 నుంచి థియేటర్లు బంద్‌కు ఎగ్జిబిటర్లు ప్రకటన.
అద్దె విధానం వల్ల నష్టాలు; పర్సంటేజీ చెల్లింపు డిమాండ్.
నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి; 23న మరో సమావేశం.
పర్సంటేజీ విధానంపై నిర్మాతల్లో అభిప్రాయ భేదాలు.
థియేటర్ల బంద్ ప్రకటన
జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో జూన్‌పై విడుదలయ్యే సినిమాలపై ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్‌లో చర్చించారు. ఈ నెల 23న మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో శుక్రవారం రోజైనా తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను అద్దె విధానంలో నడుపుతున్నారు. దీని వల్ల తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అందుకే పర్సంటేజీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజా సమావేశంలో పర్సంటేజీ విధానంపై కొందరు నిర్మాతలు మొగ్గు చూపగా.. మరికొందరు ఓకే చేయలేదని సమాచారం. ఈ సమావేశంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, నాగవంశీ పాల్గొన్నారు.
అద్దె విధానంపై వివాదం
నిర్మాతలు, ఎగ్జిబిటర్ల చర్చలు
జూన్ 1న థియేటర్లు బంద్ అవుతాయా లేదా అనేది 23వ తేదీన తేలిపోనుంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు కీలకంగా మారాయి. పర్సంటేజీ విధానంపై తీసుకునే నిర్ణయం భవిష్యత్తును నిర్ణయిస్తుంది.


