
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుంది.
- మార్చి 4న హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు.
- హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల్ల జంటగా ‘బ్యాండ్ మేళం’ మూవీ మార్చి 13న విడుదల కానుంది.
- ‘కోర్ట్’ మూవీతో హిట్ అందుకున్న ఈ జంటపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుంది. ఇదిలా ఉండగా, హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల్ల జంట కూడా వార్తల్లో నిలుస్తున్నారు.
విజయ్, రష్మికల వివాహం ఎక్కడ, ఎప్పుడు?
Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాతో వీరిద్దరూ పరిచయమయ్యారు. అంతేకాదు వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇక ఈ జంట జీవితంలో ఒక్కటవ్వాలని.. అప్పుడే చాలామంది కోరుకున్నారు. ఇక అభిమానులు అలా కోరుకున్నారో లేదో ఇక ఈ జంట కూడా తమ జీవితంలో ఒక్కటి కావాలనుకున్నారో ఏమో కానీ అప్పటినుంచి రహస్యంగానే ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చారు. 2018 నుండి 2026 వరకు దాదాపు 8 సంవత్సరాలు చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. ఎవరికీ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బహిర్గతం చేయలేదు.
ఇకపోతే ఈ జంట ఎప్పుడు తమ ప్రేమ బంధాన్ని బయటపెడతారు అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసినా.. వీరు మాత్రం ఎక్కడా స్పందించలేదు. దీనికి తోడు గత ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ సమయంలో కూడా అభిమానులతో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక అసలు వీరెందుకు ఇలా రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి 26వ తేదీన వివాహం చేసుకోబోతున్నాం అంటూ ఒక్కసారిగా బాంబు పేల్చి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అలా అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్ లో అత్యంత ఘనంగా వివాహం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ” ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అంటూ ఈ వివాహాన్ని చాలా ప్రైవేటుగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 4వ తేదీన హైదరాబాద్లోనే తాజ్ కృష్ణ హోటల్లో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. అలా ఇన్ని రోజులు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించి.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతున్న ఈ జంట ఒకటి కాబోతున్న నేపథ్యంలో తెరపైకి మరో రూమర్డ్ జంట వచ్చేసింది.
హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల్లల ‘బ్యాండ్ మేళం’ మూవీ విశేషాలు
వారెవరో కాదు హర్ష్ రోషన్(Harsh Roshan), శ్రీదేవి అప్పల్ల (Sridevi Apalla). ‘ కోర్ట్’మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఈ జంట.. మళ్లీ ‘బ్యాండ్ మేళం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు యువతలో విపరీతమైన అంచనాలను పెంచేసాయి. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మార్చి 13వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman ) హర్ష్ రోషన్, శ్రీదేవి జంటపై చేసిన కీలక వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి.
“మీ ఇద్దరి కెమిస్ట్రీ.. ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి. అంటే గొడవలు రాకుండా చూసుకోండి. కొట్టుకోవద్దండి. లైఫ్ లో మీరు కచ్చితంగా చాలా దూరం ప్రయాణిస్తారు. నేను అన్న మాటలను వేరేలా అనుకోకండిరా.. నేను చదువుకోలేదు.. ఫిఫ్త్ ఫెయిల్.. నాకు జువాలజీ కానీ ఏ లాజీ కానీ తెలియదు” అంటూ ఫన్నీగా మాట్లాడారు. దాంతో అక్కడున్న మూవీ టీమ్ అంతా నవ్వుకున్నప్పటికీ.. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న లాగే హర్ష్ రోషన్, శ్రీదేవి మారుతారేమో అనే కామెంట్లు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ కూడా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వరుసగా చేసి మంచి విజయాలను అందుకుని, ఆ తర్వాత రిలేషన్ కొనసాగించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీరు కూడా కోర్ట్ , బ్యాండ్ మేళం చిత్రాలతో పాటు పబ్లిక్ లో కూడా వీరు సన్నిహితంగా ఉంటున్న దృశ్యాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరి వారి లాగే వీరు కూడా భవిష్యత్తులో ఒక్కటవుతారేమో అనే కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ జంట వీటిపై స్పందించి చెక్ పెడతారేమో చూడాలి.
టాలీవుడ్ లో మరో ప్రేమ జంట?
మొత్తానికి టాలీవుడ్ లో ఒక జంట పెళ్లి పీటలెక్కనుండగా, మరొక జంట తెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు జంటలు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.


