|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Top 10 Indian movies: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!

Published: 21-06-2025, 7:08 AM
Top 10 Indian movies: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!

ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ కథనంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం.

Key Points

ప్రపంచవ్యాప్త విజయం

ఇండియన్‌ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ ‍అవార్డ్‌ దక్కించుకున్న తర్వాత మన సినీ ఇండస్ట్రీకి వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ‍త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్‌ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు అత్యధిక వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్‌-10 చిత్రాలేవో చూసేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్‌ దంగల్‌ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ఈ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్‌, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్‌తో సమానంగా సౌత్‌ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.

2017లో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది.

గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆదిపోయింది. బాహుబలి-2 కంటే కేవలం రూ. 69 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్‌లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. అయితే కేజీఎఫ్‌-2 సినిమాతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ఈ మూవీతోనే శాండల్‌వుడ్‌ పేరు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు

అగ్రస్థానంలో దంగల్

సినిమాపేరు     వరల్డ్ బాక్సాఫీస్(గ్రాస్)  ఇండియన్‌ బాక్సాఫీస్(గ్రాస్)       డైరెక్టర్‌            విడుదల సంవత్సరం దంగల్‌-               2070                         535                              నితీశ్ తివారీ              2016

బాహుబలి 2:        1788                        1416                             రాజమౌళి               2017

పుష్ప:పార్ట్ 2      1742                         1471                             సుకుమార్              2024

ఆర్ఆర్ఆర్         1230                         915                                  రాజమౌళి             2022

కేజీఎఫ్- 2         1215                        1000                                 ప్రశాంత్ నీల్         2022

సౌత్ ఇండియన్ సినిమాల ఆధిపత్యం

జవాన్              1160                        760                                     అట్లీ                  2023

పఠాన్              1055                         657                                  సిద్ధార్థ్ ఆనంద్        2023

కల్కి                 1042                    767                                  నాగ్ అశ్విన్                2024

బజరంగీ భాయిజాన్   921                432                                  కబీర్ ఖాన్                2015

యానిమల్           915                   660                                   సందీప్ రెడ్డి వంగా      2023

ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది. ఈ టాప్ 10 సినిమాలు దానికి నిదర్శనం. భవిష్యత్తులో మరింత విజయవంతమైన చిత్రాలు రావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.