|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రపంచంలో టాప్ 10 అందమైన హీరోయిన్లు వీళ్లే.. ఇండియా నుంచి ఒక్కరికే ఛాన్స్.. అది కూడా ప్రభాస్ హీరోయిన్‌కే..

Published: 13-08-2025, 7:12 AM
ప్రపంచంలో టాప్ 10 అందమైన హీరోయిన్లు వీళ్లే.. ఇండియా నుంచి ఒక్కరికే ఛాన్స్.. అది కూడా ప్రభాస్ హీరోయిన్‌కే..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత అందమైన హీరోయిన్ల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఆ జాబితాలో ఇండియా నుంచి కేవలం ఒక నటి మాత్రమే స్థానం దక్కించుకుంది. ఆమె ఎవరో తెలుసుకుందాం.

Key Points

1

ఐఎండీబీ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 అందమైన హీరోయిన్లలో కృతి సనన్ స్థానం.

2

ఇండియా నుంచి కృతి సనన్ ఒక్కరే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

4

పాకిస్థాన్‌కు చెందిన హనియా అమీర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఐఎండీబీ టాప్ 10 లిస్ట్ విడుదల

ప్రపంచంలో అత్యంత అందమైన హీరోయిన్లు ఎవరు? ఈ డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది. తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఇండియా నుంచి కేవలం ఒకే ఒక్క నటి మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం. పాకిస్థాన్ కు చెందని మరో నటికి కూడా ఈ టాప్ 10లో చోటు దక్కింది.

ప్రపంచంలో అత్యంత అందమైన హీరోయిన్ల జాబితాను ఐఎండీబీ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇండియాలో ఎంతో మంది సుందరాంగులు ఉన్నా.. ఒక్కరికి మాత్రమే ఈ టాప్ 10 జాబితాలో చోటు దక్కింది. ఆమె పేరు కృతి సనన్ . గతంలో ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ మూవీలో సీతగా నటించిన కృతి సనన్ ఈ లిస్టులో ఉంది.

తన అందం, ఆకర్షణ, అసాధారణ నటనకు పేరుగాంచిన నటి కృతి సనన్. ఐఎండీబీ రిలీజ్ చేసిన లిస్టులో ఏకైక ఇండియన్ హీరోయిన్ గా ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని వివిధ సినీ ఇండస్ట్రీల నుండి ప్రముఖ హీరోయిన్లకు ఇందులో చోటు దక్కింది. వీళ్లలో కృతి నాలుగో స్థానంలో ఉండటం విశేషం.

గ్లోబల్ సెలబ్రిటీలైన ఎమ్మా వాట్సన్, అనా డె అర్మాస్, హనియా అమీర్ లాంటి వాళ్లతో కలిసి ఆమె టాప్ 10లో ఉంది. ఇది ఇండియాతోపాటు అంతర్జాతీయంగా కూడా ఆమెకు పెరుగుతన్న ఫాలోయింగ్ కు నిదర్శనంగా చెప్పొచ్చు.

కృతి సనన్ తన నవ్వుతోనే అందరినీ పడేస్తుంది. తన ప్రవర్తన, అద్భుతమైన నటనతో ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తోంది. జాతీయ అవార్డు గెలుచుకోవడంతోపాటు తన పాత్రల ఎంపిక, వ్యక్తిత్వంతోనూ ఆమె ప్రత్యేకంగా నిలవడం విశేషం. ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో స్థానం పొందడం సహా అనేక గౌరవాలను అందుకుంది.

కృతి సనన్ అరుదైన ఘనత

ప్రస్తుతం తన కెరీర్‌లో పీక్ స్టేజ్ లో ఉన్న కృతితో కలిసి పనిచేయడానికి ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె త్వరలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తేరే ఇష్క్ మే’లో కనిపించనుంది. ఆమె ‘డాన్ 3’, ‘కాక్‌టెయిల్ 2’ చిత్రాలలో కూడా భాగం కానుందని రిపోర్టులు చెబుతున్నాయి.

టాప్ 10లో ఇండియా నుంచి కృతి సనన్ ఉండగా.. పాకిస్థాన్ నుంచి కూడా ఓ నటికి స్థానం దక్కింది. ఆమె పేరు హనియా అమీర్.

1. మెక్ కెన్నా గ్రేస్ – అమెరికా

2. జూలియా బటర్స్ – అమెరికా

3. హనియా అమీర్ – పాకిస్థాన్

ఇతర దేశాల హీరోయిన్లు

5. నాన్సీ మెక్ డోనీ – అమెరికా/దక్షిణ కొరియా

6. దిల్రాబా దిల్మురత్ – చైనా

7. షైలీన్ వుడ్లీ – అమెరికా

8. మార్గోట్ రాబీ – ఆస్ట్రేలియా

9. అనా డి అర్మాస్ – క్యూబా/స్పెయిన్

ఐఎండీబీ జాబితాలో కృతి సనన్ స్థానం ఆమె అందం, నటనకు నిదర్శనం. ఇండియన్ సినీ పరిశ్రమకు ఆమె గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.