
తాజాగా విడుదలైన 37వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో తెలుగు టీవీ సీరియల్స్ లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ మాకు గట్టి దెబ్బ తగిలితే, జీ తెలుగు ఛానెల్ ఆధిపత్యం చూపింది.
Key Points
స్టార్ మాకు షాక్: టాప్ 10లో కేవలం 5 సీరియల్స్ మాత్రమే!
జీ తెలుగు సత్తా: టాప్ 10లో 5 సీరియల్స్‌తో హవా!
నువ్వుంటే నా జతగా, బ్రహ్మముడి టాప్ 10 నుంచి బయట!
స్టార్ మాకు గట్టి దెబ్బ
స్టార్ మా ఛానెల్ కు గట్టి దెబ్బే తగిలింది. గడిచిన కొన్ని ఏళ్లుగా టాప్ 10లో కనీసం ఆరు నుంచి ఏడు సీరియల్స్ తో సత్తా చాటిన ఆ ఛానెల్ తాజాగా ఐదు సీరియల్స్ కు పడిపోయింది. బ్రహ్మముడి, నువ్వుంటే నా జతగాలాంటి సీరియల్స్ టాప్ 10లో నుంచి వెళ్లిపోయాయి. ఏకంగా ఐదు జీ తెలుగు సీరియల్స్ ఈసారి టాప్ 10లోకి దూసుకొచ్చాయి.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మాకు కొన్నేళ్లుగా అసలు తిరుగే లేదు. ఇప్పటికే టాప్ 10లో టాప్ 5 సీరియల్స్ ఆ ఛానెల్ కు చెందినవే ఉన్నాయి. అయితే మరో ఐదు స్థానాలను జీ తెలుగుకు కోల్పోక తప్పలేదు. తాజాగా 37వ వారం రేటింగ్స్ లో కేవలం ఐదు సీరియల్స్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి.
జీ తెలుగు సీరియల్స్ ఆధిపత్యం
టాప్‌లో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తాజాగా 14.16 రేటింగ్ నమోదైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ సీరియల్ రేటింగ్ 14 దాటింది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. ఈ సీరియల్ కు 13.01 రేటింగ్ వచ్చింది. మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు కొనసాగుతోంది.
ఈ సీరియల్ కు 11.73 రేటింగ్ రాగా.. నాలుగో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం సీరియల్ కు 11.15 రేటింగ్ నమోదైంది. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ ఉంది. ఈ మధ్యే ఈ సీరియల్ ఫిమేల్ లీడ్ మారిపోయినా సీరియల్ దూసుకెళ్తూనే ఉంది. తాజా రేటింగ్స్ లో 10.66తో ఐదో స్థానంలో ఉంది.
నువ్వుంటే నా జతగా, బ్రహ్మముడి లాంటి సీరియల్స్ టాప్ 10లో చోటు కోల్పోయాయి. బిగ్ బాస్ కారణంగా రాత్రి 9.30కు బదులుగా సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతున్న నువ్వుంటే నాజతగా సీరియల్ రెండు వారాలుగా టాప్ 10లో నుంచి వెళ్లిపోయింది.
టాప్ 10 సీరియల్స్ రేటింగ్స్ వివరాలు
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
37వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో జీ తెలుగు సీరియల్స్ సత్తా చాటాయి. టాప్ 10లో ఏకంగా ఐదు సీరియల్స్ ఉన్నాయి. ఆరు నుంచి పది స్థానాల్లో ఆ ఛానెల్ కు చెందినవే ఉండటం విశేషం. ఆరో స్థానంలో 8.74 రేటింగ్ తో మేఘ సందేశం ఉంది. ఇక ఏడో స్థానంలో చామంతి ఉంది. దీనికి 8.02 రేటింగ్ నమోదైంది.
8వ స్థానం జగద్ధాత్రి దక్కించుకుంది. ఈ సీరియల్ కు 7.75 రేటింగ్ రాగా.. 9వ స్థానంలో ఉన్న లక్ష్మీ నివాసం సీరియల్ కు 7.68 రేటింగ్ వచ్చింది. చివరిగా పదో స్థానంలో జయం సీరియల్ ఉంది. దీనికి 7.67 రేటింగ్ రావడం విశేషం. చివరి మూడు స్థానాల కోసం జీ తెలుగుకు చెందిన ఈ మూడు సీరియల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
37వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో జీ తెలుగు ఛానెల్ ఆధిపత్యం కనిపించింది. కార్తీకదీపం 2 టాప్ లో ఉండగా, స్టార్ మా కొన్ని ప్రముఖ సీరియల్స్ టాప్ 10 నుండి తప్పుకున్నాయి.


