|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో టాప్‌ 5 మూవీస్‌.. ఊహించని వ్యూస్‌తో దుమ్మురేపుతున్న చిత్రాలివే

Published: 18-11-2025, 10:49 PM
ఓటీటీలో టాప్‌ 5 మూవీస్‌.. ఊహించని వ్యూస్‌తో దుమ్మురేపుతున్న చిత్రాలివే

ప్రస్తుతం థియేటర్‌ చిత్రాల కంటే ఓటీటీకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన గత వారం టాప్‌ 5 ఓటీటీ సినిమాల జాబితాలో ‘కాంతార చాప్టర్‌ 1’ అగ్రస్థానంలో నిలిచింది. ఇతర చిత్రాలైన ‘బారాముల్లా’, ‘లోకా చాప్టర్‌ 1’, ‘జాలీ ఎల్‌ఎల్‌ బీ 3’ కూడా ఊహించని వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.

Key Points

1

ఓర్మాక్స్ మీడియా ప్రతి వారం విడుదల చేసే టాప్ 5 ఓటీటీ జాబితాలో ఈ సినిమాలున్నాయి.

2

`కాంతార చాప్టర్‌ 1` 3.3 మిలియన్‌ వ్యూస్‌తో అమెజాన్‌ ప్రైమ్‌లో అగ్రస్థానంలో ఉంది.

4

`లోకా చాప్టర్‌ 1` జియో హాట్‌స్టార్‌లో 2.7 మిలియన్‌ వ్యూస్‌తో టాప్ 3లో సత్తా చాటింది.

ఓటీటీ ఆదరణ: ట్రెండింగ్‌లో ఏమున్నాయి?

ఇప్పుడు థియేటర్ సినిమాల కంటే ఓటీటీ చిత్రాలకే ఎక్కువగా ఆదరణ దక్కుతుంది. ఆడియెన్స్ ఓటీటీలోనే ఎక్కువగా మూవీస్‌ చూస్తున్నారు. ప్రస్తుతం గత వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన ఓటీటీ మూవీస్‌ ఏంటో లిస్ట్ వచ్చింది. ఓర్మాక్స్ మీడియా ప్రతి వారం టాప్‌ 5 ఓటీటీ మూవీస్‌ జాబితా ఇస్తుంటుంది. అరగంట కంటే ఎక్కువగా చూసిన ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ లిస్ట్ ఇస్తుంటుంది. అన్ని ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్ ల నుంచి ఈ జాబితాని ఎంపిక చేస్తుంటారు. తాజాగా ఇందులో `కాంతార 2` దుమ్ములేపుతోంది. మరి టాప్‌ 5 ఓటీటీ సినిమాలేంటో చూద్దాం.

`కాంతార చాప్టర్‌ 1` మూవీ గత నెలలో వచ్చి విశేష ఆదరణ పొందింది. విజయదశమి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఎనిమిది వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇందులో రిషబ్‌ శెట్టి హీరోగా నటించగా, ఆయనే దర్శకుడు కావడం విశేషం. ఆయనకు జోడీగా రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా చేసింది. రెండేళ్ల క్రితం వచ్చిన `కాంతార`కిది ప్రీక్వెల్‌. బాక్సాఫీసు వద్ద దుమ్ములేపిన ఈ మూవీ ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం 3.3 మిలియన్‌ వ్యూస్‌తో టాప్‌లో ఉంది.

టాప్ 5 జాబితాలో కాంతార 2 దూకుడు

రెండో స్థానంలో హిందీ మూవీ `బారాముల్లా` ఉంది. మానవ్‌ కౌల్‌, భాషా సుంబి, నీలోఫర్ హమిద్‌ వంటి వారు నటించిన ఈ మూవీ సూపర్‌ నేచురల్‌ హర్రర్‌ గా వచ్చింది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ మూవీ నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ప్రస్తుతం ఇది ఓటీటీలో విశేష ఆదరణ పొందుతుంది. గత వారంలోనే మూడు మిలియన్‌ వ్యూస్‌ సాధించడం విశేషం.

మూడో స్థానంలో మలయాళ సంచలనం `లోకా చాప్టర్‌ 1`(కొత్త లోక) ఉంది. కళ్యాణి ప్రియదర్శన్‌, నెస్లన్‌, సాండీ మాస్టర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి డామినిక్‌ అరుణ్‌ దర్శకుడు. దుల్కర్ సల్మాన్‌ నిర్మాత కావడం విశేషం. సూపర్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ఆగస్ట్ 28న విడుదలై ఏకంగా మూడు వందల కోట్లు సాధించింది. మోహన్‌లాల్‌, మమ్ముట్టిలకు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇది రూ.2.7 మిలియన్‌ వ్యూస్‌తో ఓటీటీలో టాప్‌ 3లో నిలిచింది.

ఇతర సినిమాల వ్యూస్ వివరాలు

నాల్గో స్థానంలో బాలీవుడ్‌ మూవీ `జాలీ ఎల్‌ఎల్‌ బీ 3` ఉంది. లీగల్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, అర్షద్‌ వార్సీ, సౌరభ్‌ శుక్లా ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 19న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో ఫర్వాలేదనిపించుకుంది. పెద్ద హిట్‌ కాదు. కానీ ఓటీటీలో మాత్రం రచ్చ చేస్తోంది. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ 2.2 మిలియన్‌ వ్యూస్‌తో టాప్ 4లో ఉండటం విశేషం. థియేటర్లలో కంటే ఓటీటీలో దీన్ని ఎక్కువగా చూస్తున్నారు.

ఇండియన్‌ ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న చిత్రాల్లో హాలీవుడ్‌ మూవీ ఉండటం విశేషం. జులైలో విడుదలైన `ది ఫాంటాస్టిక్ ఫోర్‌ ఫస్ట్ స్టెప్స్` మూవీ టాప్‌ 5లో ఉంది. జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ రెండు మిలియన్‌ వ్యూస్‌తో రచ్చ చేస్తోంది. మార్వెల్‌ నుంచి సూపర్‌ హీరో కథతో వచ్చిన ఈ చిత్రానికి మాట్‌ షాక్మన్‌ దర్శకుడు. పెడ్రో పాస్కల్‌, వెనెసా కిర్బీ,ఎబాన్‌ మాస్‌, జోసెఫ్‌ క్వీన్న్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది థియేటర్లో దుమ్ములేపింది. ఏకంగా నాలుగు వేల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందడం విశేషం.

మొత్తంగా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ చిత్రాలు సాధిస్తున్న విజయం ప్రేక్షకుల అభిరుచిలో మార్పును సూచిస్తుంది. ‘కాంతార 2’ వంటి సినిమాలు భారీ వ్యూస్‌తో డిజిటల్ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.