
టొవినో థామస్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ నరివెట్ట సినిమా తెలుగులో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Key Points
టొవినో థామస్ నటించిన ‘నరివెట్ట’ తెలుగులో విడుదల.
మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రిలీజ్‌ను నిర్వహిస్తున్నారు.
జూన్ మొదటి వారంలో థియేటర్లలో విడుదల కానుంది.
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.
నరివెట్ట తెలుగులో విడుదల
టొవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ నరివెట్ట తెలుగులోకి వస్తోంది. థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో విడుదలచేస్తోంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఆ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. రిలీజ్ డేట్‌ను మాత్రం రివీల్ చేయలేదు. జూన్ ఫస్ట్ వీక్‌లో నరివెట్ట మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల మలయాళం లో థియేటర్లలో రిలీజైన నరివెట్ట మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. పదిహేను కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ రిలీజైంది. ఆరు రోజుల్లో పది కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్‌లోనే మూవీ బ్రేక్ ఈవెన్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
రిలీజ్ తేదీ వివరాలు
నరివెట్ట మూవీలో సూరజ్ వెంజరమూడు, చేరన్ ప్రధాన పాత్రలు పోషించారు. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించాడు. 2003లో జరిగిన ముతంగ ఘటన ఆధారంగా నరివెట్ట మూవీని రూపొందించాడు దర్శకుడు. రాజకీయ ఒత్తిడుల కారణంగా వృత్తి నిర్వహణలో పోలీసులు ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంటారన్నది ఈ మూవీలో థ్రిల్లింగ్‌గా చూపించాడు డైరెక్టర్.
వర్గీస్ నిజాయితీతో పాటు ఆవేశం, మొండితనం ఎక్కువ. తన మనస్తత్వం కారణంగా ఏ ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగలేకపోతాడు. నాన్సీని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వర్గీస్‌ను వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఇష్టంలేకపోయినా సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ జాబ్‌లో జాయిన్ అవుతాడు వర్గీస్. బషీర్ అహ్మద్ అనే ఆఫీసర్ కింద పనిచేయడం మొదలుపెడతాడు.
కథానాయకుడి నటనకు ప్రశంసలు
పోడు భూములకు తమకు అప్పగించాలంటూ ఆదివాసీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటారు. ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీసులను, సీఆర్‌పీఎఫ్ టీమ్‌ను ప్రభుత్వం అక్కడి పంపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ప్రభుత్వానికి, ఆదివాసీలకు జరిగిన యుద్ధంలో వర్గీస్ ఎవరిపై నిలబడ్డాడు అన్నదే ఈ మూవీ కథ.
కానిస్టేబుల్ పాత్రలో టొవినో థామస్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ కంటే ముందు ఐడెంటిటీ, ఏఆర్ఎమ్ సినిమాలు చేశాడు టొవినో థామస్. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ ఎల్2 ఎంపురాన్‌లో ఓ కీలక పాత్రలో నటించాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ మూవీస్ చేస్తోన్నాడు.
మొత్తంమీద, నరివెట్ట సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. టొవినో థామస్ నటన, కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.


