|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో టోవినో అవుట్! అసలు కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 31-03-2026, 10:05 AM
షాకింగ్: ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీలో టోవినో అవుట్! అసలు కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  • ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ నుండి తప్పుకున్న టోవినో థామస్ – కారణం రెమ్యునరేషన్ సమస్యలేనా?
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న డ్రాగన్ మూవీలో టోవినో నటించకపోవడానికి డేట్స్ సమస్య కూడా ఒక కారణం!
  • తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తే మలయాళం సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని టోవినో ఆసక్తికర వ్యాఖ్యలు.
  • బన్నీ వాసు రిలీజ్ చేస్తున్న టోవినో తాజా చిత్రం ‘పల్లిచట్టంబి’ ఏప్రిల్ 10న విడుదల కానుంది.

టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ గురించి ఒక సంచలన వార్త! ఈ సినిమాలో టోవినో థామస్ నటించడం లేదనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగింది?

డ్రాగన్ మూవీలో టోవినో తప్పుకోవడానికి కారణం ఇదేనా?

ఓటీటీ ప్రభావం పెరిగిన తర్వాత మలయాళీ హీరోలు కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు. వారిలో టోవినో థామస్ ఒకరు. 2018 అనే మూవీతో పాటు అనే టోవినో నటించిన అనేక చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. త్వరలో టోవినో నటించిన మరో చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. టోవినో నటించిన లేటెస్ట్ మూవీ పల్లిచట్టంబి అనే చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది.

ఈ చిత్రాన్ని తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న టోవినో థామస్ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయనిచ్చిన ఒక సమాధానంపై టాలీవుడ్ లో చర్చ మొదలైంది.

తెలుగు సినిమాలపై టోవినో ఆసక్తికర వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో టోవినో థామస్ నటిస్తున్నట్లు గతంలో జోరుగా వార్తలు వచ్చాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో టోవినో కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. డ్రాగన్ నిర్మాతలు టోవినో థామస్ తో చర్చలు కూడా జరిపారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ డ్రాగన్ లో టోవినో పాత్ర గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

దీని గురించి తాజాగా మీడియా సమావేశంలో టోవినో ప్రశ్నించగా.. తాను డ్రాగన్ మూవీలో నటించడం లేదని తేల్చేశారు. తాను నటిస్తున్న సినిమాలకు డేట్లు అడ్జెస్ట్ చేయడం కష్టంగా మారింది అని అందుకే డ్రాగన్ మూవీలో నటించడం లేదని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం భిన్నంగా ఉంది. డ్రాగన్ నిర్మాతలకు, టోవినోకి మధ్య రెమ్యునరేషన్ విషయంలో అంగీకారం కుదర్లేదని వార్తలు వస్తున్నాయి.

‘పల్లిచట్టంబి’ మూవీతో టోవినో గ్రాండ్ ఎంట్రీ!

తాను మలయాళీ సినిమాలకు తీసుకునే మొత్తం కంటే భారీగా టోవినో డ్రాగన్ మూవీకి డిమాండ్ చేశారట. అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు డ్రాగన్ మేకర్స్ రెడీగా లేరు. దీనితో టోవినో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా స్ట్రైట్ గా తెలుగు సినిమాలో నటించడం గురించి కూడా టోవినో సమాధానం ఇచ్చారు. టోవినో మాట్లాడుతూ.. మలయాళంతో పోల్చితే తెలుగులో వర్కింగ్ స్టైల్ డిఫెరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ని మల్టిపుల్ షెడ్యూల్స్ లో చేస్తారు. మేము ఒకే షెడ్యూల్ లో పూర్తి చేస్తాం. తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలని నాకు కూడా ఉంది. కానీ ఒక తెలుగు మూవీ చేస్తే అక్కడ నేను కమిటైన నాలుగైదు మలయాళం సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి అని టోవినో బదులిచ్చారు.

టోవినో ‘డ్రాగన్’ మూవీ నుంచి తప్పుకోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.