|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

TOXIC : బోల్డ్ సీన్స్.. బోలెడంత రచ్చ..!

Published: 09-01-2026, 10:45 PM
TOXIC : బోల్డ్ సీన్స్.. బోలెడంత రచ్చ..!
  • యశ్ ‘టాక్సిక్’ మూవీ టీజర్ మాలీవుడ్‌లో సంచలనం, వివాదాలకు దారితీసింది!
  • దర్శకురాలు గీతు మోహన్ దాస్‌పై ట్రోల్స్, అభ్యంతరకర సన్నివేశాలే కారణం!
  • మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రంపై నిషేధం విధించాలని డిమాండ్లు!
  • సెన్సార్ బోర్డు నిర్ణయం కోసం ఎదురుచూపులు, ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది!

కేజీఎఫ్-2 తర్వాత యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్. టీజర్ విడుదల తర్వాత మలయాళంలో పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. అసలు ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.

టీజర్‌తోనే మొదలైన రచ్చ!

TOXIC : కేజీఎఫ్-2 తర్వాత కన్నడ స్టార్ యశ్ చేస్తున్న సినిమా టాక్సిక్. ఈ మూవీ మార్చి 19న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే ఇటీవల యశ్ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ మూవీ టీజర్ ఇప్పుడు మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. అసలు ఈ సినిమా రిలీజ్ చేయొద్దంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి.

ఇంతలా ఈ మూవీ టీజర్ కాంట్రవర్సీ అవడానికి కారణం ఒక్కటే.. అభ్యంతరకర సీన్స్ ఉండటమే. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ టాక్సిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌లో యశ్ ఎంట్రీని గ్రాండ్‌గా చూపిస్తూ లేడీస్‌ను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న సీన్లు పెట్టడంతో హీరో కన్న డైరెక్టర్ గీతుమోహన్ దాసే అందరికీ టార్గెట్ అయిపోయారు.

గీతు మోహన్ దాస్‌పై ట్రోల్స్ ఎందుకు?

కేవలం టీజర్‌కే ఇంత కాంట్రవర్సీ అవుతుంటే ఇక సినిమా ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది. మమ్ముట్టి ఫ్యాన్స్ అయితే మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్‌ను ట్రోల్స్‌ చేస్తూ లేడీ అయి ఉండి ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యశ్ రీఎంట్రీ సినిమాగా టాక్సిక్‌ మూవీ ఆడియన్స్ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తే..చాలా మంది మాలీవుడ్ ప్రముఖులు మాత్రం గీతు మోహన్‌దాస్‌పై ఫైర్ అవుతున్నారు.

సెన్సార్ ముందుకు ‘టాక్సిక్’.. ఏం జరుగుతుందో?

టీజర్‌ చూసే సినిమాను నిలిపివేయాలన్న డిమాండ్లు వినిపిస్తుంటే.. ఇక సెన్సార్ దగ్గరికి వెళ్తే పరిస్థితి ఏంటన్న టాక్ నడుస్తుంది. కాంట్రవర్సీ అవుతుండటంతో అభ్యంతరకర సీన్లు తీసేస్తారా.? లేక ఎన్ని విమర్శలు వచ్చినా అలాగే కంటిన్యూ చేసి సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.

టాక్సిక్ మూవీ చుట్టూ జరుగుతున్న ఈ వివాదాలపై మీ అభిప్రాయం ఏమిటి? సినిమా విడుదల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.