|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – బ్లాక్ బస్టర్ మూవీస్ ను దాటేసి ట్రెండింగ్ లోకి!

Published: 31-05-2025, 7:17 AM
ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - బ్లాక్ బస్టర్ మూవీస్ ను దాటేసి ట్రెండింగ్ లోకి!

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘చౌర్య పాఠం’ అనే తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ఓటీటీలో అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలను దాటి ట్రెండింగ్ లిస్ట్ లోకి చేరింది. ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.

Key Points

1

ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం 'చౌర్య పాఠం'.

2

ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రధారులు.

4

థియేటర్లలో విఫలమైనప్పటికీ, ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

చౌర్య పాఠం: ఓటీటీ విజయం

తెలుగు క్రైమ్ కామెడీ మూవీ చౌర్య పాఠం ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ మూవీ టాప్ టెన్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం , క‌న్న‌డ భాష‌ల్లో కూడా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌ను దాటేసి ట్రెండింగ్ లిస్ట్‌లోకి చౌర్య పాఠం వ‌చ్చింది.

చౌర్య పాఠం మూవీలో ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మ‌స్త్ అలీ, రాజీవ్ క‌న‌కాల‌, సుప్రియ ఐసోల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ క్రైమ్ కామెడీ మూవీకి మిరాయ్‌ డైరెక్ట‌ర్ , టాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మేని క‌థ‌ను అందించారు. ధ‌మాకా డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన చౌర్య పాఠం సినిమాను నిర్మించారు. ఈ క్రైమ్ కామెడీ మూవీకి నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

నటీనటులు మరియు సినిమా కథ

ఏప్రిల్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన చౌర్య‌పాఠం మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. థియేట‌ర్ల‌లో ఫెయిల్యూర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అద‌ర‌గొడుతోంది.

ధ‌న‌పాళి ఆద‌ర్శ గ్రామంగా అవార్డులు అందుకుంటుంది. ఒక్క నేరం కూడా జ‌ర‌గ‌ని ఊరుగా నిలుస్తుంది. ఓ డాక్యుమెంట‌రీ తీయ‌డానికి త‌న స్నేహితుల‌తో ధ‌న‌పాళి వ‌స్తాడు వేదాంత్ రామ్‌. ఆ ఊరి గ్రామీణ బ్యాంకులోని డ‌బ్బును దోచుకోవాల‌ని ప్లాన్‌. వేస్తాడు వేదాంత్ రామ్‌.

థియేటర్ విఫలం, ఓటీటీ విజయం

ఈ క్ర‌మంలోనే ఊరి స‌ర్పంచ్ వ‌సుధకు సంబంధించిన ఓ షాకింగ్ నిజం వేదాంత్ రామ్‌కు తెలుస్తుంది? అదేమిటి? వేదాంత్ రామ్‌ను ఆ ఊరివాళ్లు చంపాల‌ని ఎందుకు అనుకున్నారు. అత‌డి ప్లాన్‌లోని బ్యాంక్ ఎంప్లాయ్ అంజ‌లి ఎలా వ‌చ్చింది? వేదాంత్ రామ్ బ్యాంకు రాబ‌రీ ప్లాన్ స‌క్సెస్ అయ్యిందా? అత‌డు డైరెక్ట‌ర్ అయ్యాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

చౌర్య‌పాఠం హీరోగా ఇంద్ర‌రామ్‌కు ఫ‌స్ట్ మూవీ. హీరోయిన్ పాయ‌ల్ రాధాకృష్ణ మాత్రం గ‌తంలో తెలుగులో అలా నిన్ను చేరి, ప్ర‌స‌న్న వ‌ద‌నం, స‌త్య‌భామ‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

చివరగా, థియేటర్లలో విజయం సాధించలేకపోయిన ‘చౌర్య పాఠం’ ఓటీటీలో అనూహ్యమైన విజయాన్ని అందుకుని, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రైమ్ కామెడీ ప్రేమికులందరూ తప్పక చూడవలసిన చిత్రమిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.