|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పిరిట్ సినిమాకి త్రిప్తి డిమ్రీ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? జాక్‌ పాట్‌ అంటే ఇదే మరి

Published: 27-05-2025, 1:50 PM
స్పిరిట్ సినిమాకి త్రిప్తి డిమ్రీ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? జాక్‌ పాట్‌ అంటే ఇదే మరి

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొణె స్థానంలో ఆమె ఎంపిక కావడం, ఆమె పారితోషికం గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

Key Points

1

స్పిరిట్ సినిమాలో దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి డిమ్రీ ఎంపిక

2

త్రిప్తి డిమ్రీకి 4 కోట్ల రూపాయల పారితోషికం అంట

4

సందీప్ రెడ్డి వంగా, త్రిప్తి డిమ్రీ సోషల్ మీడియాలో సినిమా గురించి సమాచారం షేర్ చేశారు

దీపికా స్థానంలో త్రిప్తి ఎంపిక

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న `స్పిరిట్` సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తిని ఎంపిక చేశారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.  ఈ విషయాన్ని  దర్శకుడు  సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.

ఒక్క పోస్ట్ తో సినిమా కాస్టింగ్ గురించి చాలా రోజులుగా జరుగుతున్న రూమర్లకి చెక్‌ పెట్టారు.  దీపికా పదుకొణె ఈ సినిమాకి భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. అదే సమయంలో కొన్ని కండీషన్లు కూడా పెట్టిందట. సినిమాలో బోల్డ్ సీన్లు ఉన్నాయని, వాటి విషయంలో ఆమె అభ్యంతరం తెలిపిందని, అందుకే ఆమెని తప్పించారనే ప్రచారం జరుగుతుంది.

త్రిప్తి డిమ్రీ `స్పిరిట్` కోసం ఎన్ని కోట్లు తీసుకుంటోంది?

త్రిప్తికి భారీ పారితోషికం?

దీపికా పదుకొనేని ఈ సినిమా నుండి తొలగించడానికి ఆమె 20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అడగడమే ప్రధాన కారణమని అంటున్నారు. అంతేకాకుండా, ఆమె ఇటీవలే తల్లి అయినందున షూటింగ్ సమయాన్ని తగ్గించాలని కూడా కోరిందట. ఇవన్నీ వంగాకి నచ్చలేదని చెబుతున్నారు.

అందుకే ఆమె స్థానంలో `యానిమల్‌` నటి త్రిప్తి డిమ్రీకి `స్పిరిట్`లో ఆఫర్‌ ఇచ్చారు సందీప్‌. అయితే ఈ సినిమాకి త్రిప్తికి భారీగానే పారితోషికం తీసుకుంటుందట. ఆమెకి ఏకంగా 4 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు తెలుస్తుంది.   మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే త్రిప్తికిది జాక్ పాట్‌ అనే చెప్పాలి.

త్రిప్తి డిమ్రీ `స్పిరిట్‌`లో పనిచేయడాన్ని ఇలా వెల్లడించింది

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు

త్రిప్తి డిమ్రీ ఇటీవల సోషల్ మీడియాలో `స్పిరిట్` సినిమా ఆఫర్‌ రావడాన్ని కన్ఫమ్‌ చేసింది. దీన్ని షేర్ చేస్తూ, ‘ఇంకా ఈ ప్రయాణంలో నన్ను నేను వెతుక్కుంటున్నాను… ఈ ప్రయాణంలో నాపై నమ్మకం ఉంచినందుకు చాలా కృతజ్ఞతలు సందీప్ రెడ్డి వంగా. మీ దృష్టిలో భాగం కావడం  గౌరవంగా ఉంది’ అని రాసుకొచ్చింది.

అదే సమయంలో, సందీప్ రెడ్డి వంగా కూడా త్రిప్తిని సినిమాలోకి స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘ఇప్పుడు నా సినిమాలో హీరోయిన్ అధికారికంగా ఖరారైంది’ అని రాశారు. దీంతో పాటు, మరో పోస్ట్ షేర్ చేసి పేరు మెన్షన్‌ చేయకుండా దీపికా పదుకొణెని విమర్శించారు. తన కథని లీక్‌ చేసిందని, నమ్మకాన్ని బ్రేక్‌ చేసిందని,  యంగ్‌ యాక్టర్‌ని తక్కువ చేశారని, ఇదేనా ఫెమినిజం అని తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయారు సందీప్‌. దీంతో ఇది పెద్ద రచ్చ అవుతుంది.

చివరగా, త్రిప్తి డిమ్రీకి స్పిరిట్ సినిమాలో భారీ పారితోషికం అందడం గురించి వార్తలు వస్తున్నాయి. నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.