|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ కోసం త్రిష త్యాగం! రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమా? సంచలన నిర్ణయం!

Published: 29-03-2026, 1:05 PM
విజయ్ కోసం త్రిష త్యాగం! రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమా? సంచలన నిర్ణయం!
  • విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి త్రిష మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.
  • ఎన్నికల తర్వాత విజయ్, త్రిష తమ బంధం గురించి ప్రకటిస్తారని ఊహాగానాలు.
  • త్రిష ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విజయ్ కి కలిసొచ్చే అంశం కానుంది.
  • విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోరారని వార్తలు వస్తున్నాయి.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అడుగుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే, నటి త్రిష విజయ్ కి మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. త్రిష తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

విజయ్ రాజకీయ రంగ ప్రవేశం

Vijay Trisha: తమిళనాడు రాజకీయ వేడి రాజుకుంది. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నువ్వా నేనా అంటూ పెద్ద ఎత్తున పార్టీలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న విజయ్ సైతం ఈసారి ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ఈయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. మరొక నెల రోజులలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో విజయ్ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈయన కూడా రెండు చోట్ల పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన కోసం నటి త్రిష సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా నటి త్రిష విజయ్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.త్రిష కోసమే విజయ్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వబోతున్నారని  తెలుస్తోంది. వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి జంటగా పలు కార్యక్రమాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

త్రిష మద్దతు వెనుక అసలు కారణం?

తమిళనాడులో ఎన్నికలు పూర్తి అయిన వెంటనే విజయ్ త్రిష అధికారికంగా తమ రిలేషన్ గురించి ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే త్రిష రాజకీయాల గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈమె విజయ్ టీవీకే పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఇలా ఈమె ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయకపోయినా విజయ్ కోసం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారనీ తెలుస్తుంది. తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో త్రిషకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాలలో త్రిష ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

విడాకుల కోరిన విజయ్ భార్య సంగీత..

విడాకుల వార్తల్లో నిజమెంత?

విజయ్ హీరోగా తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. విజయ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనకు ఇతర సెలబ్రిటీల మద్దతు కూడా పెద్దగా అవసరం ఉండదని చెప్పాలి. కానీ త్రిష మాత్రం విజయ్ కోసం ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా త్రిష ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్న నేపథ్యంలో వీరి వ్యక్తిగత విషయాలు కూడా మరోసారి తెరపైకి వచ్చాయి. గత కొంతకాలంగా విజయ్ త్రిష రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇక విజయ భార్య సంగీత ఏకంగా విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లడంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి. వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ విజయ్ త్రిష మాత్రం ఈ వార్తలను ఎక్కడ ఖండించలేదు.

మొత్తానికి విజయ్ రాజకీయ భవిష్యత్తులో త్రిష పాత్ర కీలకంగా మారనుందా అనేది వేచి చూడాలి. వారి వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.