
📌 Key Points
- విజయ్‌తో త్రిష సహజీవనం చేస్తుందనే వార్తలకు పెళ్లి వీడియో మరింత బలం చేకూర్చింది.
- విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారని, భారీ భరణం చెల్లించనున్నారని సమాచారం.
- విజయ్-త్రిషల సంబంధంపై తమిళ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి, విజయ్‌ను అభిమానించే వారి సంఖ్య తగ్గుతోంది.
- వార్తలను పట్టించుకోకుండా త్రిష తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
స్టార్ హీరోయిన్ త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ కలిసి ఓ పెళ్లికి హాజరైన వీడియో వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే త్రిష మాత్రం దీనిపై స్పందించకుండా స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నారు.
విజయ్, త్రిషల పెళ్లి వీడియో వైరల్
Trisha: స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) పేరు ఈ మధ్య ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Kollywood Star Hero Vijay)తో ఆమె సహజీవనం చేస్తోందంటూ గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న వార్తలు కాస్తా, రీసెంట్‌గా వారిద్దరూ కలిసి ఓ పెళ్లికి అటెండ్ అయిన వీడియో చాలా వరకు క్లారిటీ ఇచ్చేసింది. విజయ్‌తో కలిసి త్రిష ఒక వివాహ వేడుకకు హాజరుకావడం.. వారి మధ్య ఎఫైర్ నడుస్తుందనే ఊహాగానాలకు బలాన్ని చేకూర్చినట్లయింది. వీరిద్దరూ కలిసి వేడుకకు రావడం, ఒక జంటలాగే తిరిగి వెళ్లడం చూసి నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు భారీ మొత్తంలో భరణం ఇవ్వాలని చూస్తున్నట్లుగా కూడా టాక్ నడిచింది. విజయ్ భార్య సంగీత (Sangeetha) విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కినట్లుగా వచ్చిన వార్తలతో విజయ్ జీవితంలో త్రిష ఎంటరైందనే అభిప్రాయానికి అంతా వచ్చేశారు.
విడాకులకు సిద్ధమైన విజయ్?
మరో వైపు తమిళనాడు రాజకీయ వర్గాల్లో కూడా విజయ్-త్రిషల సంబంధం (Vijay and Trisha Relation)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిషతో బంధం నిజమే అనేలా పిక్చర్ కనబడుతుండటంతో విజయ్‌ని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ తగ్గుతుండటం విశేషం. మరీ ముఖ్యంగా ఆయనని ఎంతగానో అభిమానించే వారు కూడా ఈ లింక్‌తో దూరమవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో విజయ్ ఫాలోయర్స్ సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఇంత జరుగుతున్నా, త్రిష మాత్రం తనను చీమ కూడా కుట్టనట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఈ వార్తలన్నింటికీ దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నారు. ఆ విషయం శుక్రవారం ఆమె షేర్ చేసిన ఫొటోలను చూస్తుంటే తెలుస్తుంది. శుక్రవారం ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలను చూసిన వారంతా.. ఇదే మాట అనుకుంటున్నారు.
రూమర్స్‌ను పట్టించుకోని త్రిష
ఈ ఫొటోల్లో త్రిష తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన వ్యక్తిగత డిజైనర్ సిడ్నీ స్లాడెన్‌తో పాటు ఇతర ఫ్రెండ్స్‌తో దిగిన ఈ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ల ద్వారా త్రిష ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. తనపై వస్తున్న రాజకీయ విమర్శలు, రూమర్స్ గురించి తాను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, స్నేహితులతో తన వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నానని ఆమె ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. అంతేగా మరి, అసలోడే వెంటేసుకుని తిరుగుతుంటే.. ఇంక తనకి భయమేం ఉంటుంది. అన్నట్టు రాబోయే ఎన్నికలలో త్రిష కూడా విజయ్ పార్టీ తరపున పోటీ చేస్తుందని అంటున్నారు. ఇంకా ఈ జంట గురించి ఎన్నెన్ని వినాల్సి వస్తుందో.. వెయిట్ అండ్ సీ..
మొత్తానికి త్రిష తనపై వస్తున్న రూమర్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె షేర్ చేసిన ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఆమె తన జీవితాన్ని తన స్నేహితులతో ఆనందంగా గడుపుతోంది.


