
📌 Key Points
- దురంధర్ 2 సక్సెస్‌తో ఉదయ్ వీర్ సంధుకు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్!
- త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా దురంధర్ 2 నటుడు ఉదయ్ వీర్ సంధు?
- వెంకీ మామ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం ఏకే 47లో విలన్‌గా ఎంట్రీ!
- అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఆదర్శ కుటుంబం ఏకే 47 రిలీజ్!
టాలీవుడ్‌లో మరో సంచలనం! దురంధర్ 2 సినిమాలో మెరిసిన నటుడు ఉదయ్ వీర్ సంధు త్వరలో త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
దురంధర్ 2 నటుడికి టాలీవుడ్ ఆఫర్!
ధురంధర్ 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా, కోట్లల్లో కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. దీంతో ధురంధర్ 2 సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ సినిమాలో నటించిన వాళ్లకు కూడా ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే రణ్ వీర్ సింగ్ స్నేహితుడిగా ఈ మూవీలో మెరిసిన ఉదయ్ వీర్ సంధుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ ఉదయ్ వీర్ సంధును టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బిగ్ స్కెచ్ వేసినట్లు టాక్ నడుస్తోంది.
త్రివిక్రమ్, వెంకీ మామ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకు ఉదయ్ వీర్ సంధును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దురంధర్ 2 సినిమాలో నటుడు ఉదయ్ కొద్దిసేపు కనిపించినప్పటికీ, అందరినీ ఆకట్టుకున్నాడు. అంతకుముందు అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాలో కూడా మెరిశాడు. అయితే ఇతని నటన నచ్చిన నేపథ్యంలో తెలుగులోకి తీసుకువచ్చేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా, ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా షూటింగ్ దశలో ఉంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ఎంట్రీ?
ఆదర్శ కుటుంబం ఏకే 47 అక్టోబర్ 2 రిలీజ్!
ఉదయ్ వీర్ సంధు టాలీవుడ్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆదర్శ కుటుంబం ఏకే 47 మూవీ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


