|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూ.1000 కోట్లతో త్రివిక్రమ్ పౌరాణిక చిత్రం: బన్నీ, ఎన్టీఆర్.. ఎవరితో?

Published: 25-12-2025, 8:36 AM
రూ.1000 కోట్లతో త్రివిక్రమ్ పౌరాణిక చిత్రం: బన్నీ, ఎన్టీఆర్.. ఎవరితో?
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో రూ.1000 కోట్ల భారీ పౌరాణిక చిత్రం రానుంది.
  • ఈ సినిమాలో అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశం ఉంది.
  • సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
  • 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఓ భారీ పౌరాణిక చిత్రం రానుందని టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో హీరోగా అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ ఎవరుంటారనేది ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది.

రూ.1000 కోట్ల ప్రాజెక్ట్ వెనుక కథ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన పౌరాణిక చిత్రం కోసం సమయం తీసుకున్నప్పటికీ, ఫైనల్ గా హీరోను సెలెక్ట్ చేశారట. అల్లు అర్జున్ తో తన మైథాలజీ సినిమాను చేసేందుకు త్రివిక్రమ్ సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాను మొదట బన్నీతోనే చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. అయితే ఏమైందో తెలియదు గానీ, చివరి క్షణంలో ఎన్టీఆర్ కు కూడా ఈ కథ చెప్పారట త్రివిక్రమ్. దీంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోయింది.

అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా అల్లు అర్జున్ వద్దకు వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్లతో ఈ సినిమా చేయబోతున్నారట. సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో ఈ సినిమా వస్తోందని టాక్. త్రివిక్రమ్, ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. అటు అట్లితో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత 2027 ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాదట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా, ఈ సినిమాను సితార, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

హీరో ఎంపికలో సస్పెన్స్: బన్నీ వర్సెస్ ఎన్టీఆర్

Related News : దేవర 2 నుంచి బిగ్ అప్డేట్‌…ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండ‌గే

త్రివిక్రమ్ పౌరాణిక చిత్రం ఎప్పుడంటే?

Jailer 2: జైలర్ 2 మూవీలో బాలీవుడ్ స్టార్ ..!

త్రివిక్రమ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో రూ.1000 కోట్ల పౌరాణిక చిత్రం టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయి కావడం ఖాయం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.