|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగ వంశీకి త్రివిక్రమ్ షాకింగ్ సలహా: అన్నిట్లో వేలు పెట్టొద్దు!

Published: 29-12-2025, 8:21 AM
నాగ వంశీకి త్రివిక్రమ్ షాకింగ్ సలహా: అన్నిట్లో వేలు పెట్టొద్దు!
  • నిర్మాత నాగ వంశీకి 2025లో విడుదలైన సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి.
  • వరుస ఫ్లాప్‌లు, నష్టాలతో సతమతమవుతున్న నాగ వంశీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా ఇచ్చారు.
  • “అన్నింట్లో వేలు పెట్టొద్దు, ఫ్యామిలీ జానర్‌నే నమ్ముకో” అని త్రివిక్రమ్ సూచించినట్లు నాగ వంశీ తెలిపారు.
  • నాగ వంశీ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతికి విడుదల కానుంది.

నిర్మాత నాగ వంశీకి 2025లో వరుసగా ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. ఈ కష్టకాలంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు విలువైన సలహా ఇచ్చారు. ‘అన్నిట్లో వేలు పెట్టొద్దు.. ఫ్యామిలీ జానర్‌నే నమ్ముకో’ అంటూ త్రివిక్రమ్ సూచించిన ఈ సలహా, నాగ వంశీ తదుపరి సినిమా ‘అనగనగా ఒక రాజు’పై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.

నాగ వంశీకి వరుస ఫ్లాప్‌లు

Naga Vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ(Naga Vamsi) ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే 2025లో ఈయన భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కానీ ఏ ఒక్కటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాలు కూడా నష్టాలను మిగిల్చాయి. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నాగవంశీ కొత్త ఏడాది మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగ వంశీ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga oka Raju) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో నాగ వంశీ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా సినిమాల విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనుకు ఇచ్చిన సలహాలు గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

త్రివిక్రమ్ ఇచ్చిన విలువైన సలహా

2025 సెకండ్ హాఫ్ నుంచి నా సినీ కెరియర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని నాగ వంశీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ గారు నాతో మాట్లాడుతూ నువ్వు అన్నింట్లోనూ వేలు పెట్టొద్దు. మన బలాన్ని (ఫ్యామిలీ జానెర్) మనం నమ్ముకుందాం అంటూ ఆయన నాకు సలహా ఇచ్చారు. నాగ వంశీ నిర్మాణంలో సినిమా వస్తుంది అంటే అందరూ చూసే విధంగా ఆ సినిమా ఉంటుంది అనే నమ్మకాన్ని తీసుకు వద్దాం .ఇకపై మనం చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలా ఫ్యామిలీ జానెర్ లోనే ఉండేలా చూసుకుందాం కానీ ప్రతిదాంట్లో నువ్వు వేలు పెట్టొద్దు అంటూ బాగా క్లాస్ పీకారని నాగ వంశీ ఈ సందర్భంగా తెలియజేశారు.

సంక్రాంతి బరిలో నవీన్ పోలిశెట్టి..

కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’

ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా అంటేనే కచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సాయి సౌజన్య నాగ వంశీ సంయుక్తంగా పలు సినిమాలను నిర్మించారు. అనగనగా ఒక రోజు సినిమాకు కూడా నాగ వంశీ సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా మరో హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది.

త్రివిక్రమ్ ఇచ్చిన ఈ సలహా నాగ వంశీ సినీ కెరీర్‌కు ఎంతగా తోడ్పడుతుందో చూడాలి. కుటుంబ కథా చిత్రాలపై దృష్టి సారించి, అనవసర జోక్యాలు తగ్గించడం ద్వారా ఆయన తిరిగి విజయం సాధిస్తారని ఆశిద్దాం. ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో వేచి చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.